ఐ. ఉమాదేవి: మీరు తదియ మంగళవారం సింహలగ్నము పునర్వసు నక్షత్రం మిథునరాశి నందు జన్మించారు. మీకు 2012 వరకు అర్ధాష్టమ శనిదోషం ఉన్నందువల్ల శనికి మీ పేరుతో నెలకు ఒక శనివారంనాడు శనికి తైలాభిషేకం చేయించండి. ఈ సంవత్సరము అక్టోబర్ తదుపరి మీకు సంతానం కలిగే యోగం ఉంది. సంతాన వేణుగోపాలస్వామిని ఆరాధించడం వల్ల మీ మనోవాంఛ నెరవేరగలదు.
మీ ప్రశ్నలను customer.care@webdunia.netకు పంపించండి.