రత్నాల శాస్త్రం | పంచాంగం | వాస్తు శాస్త్రం | ఫెంగ్ షుయ్ | తారాఫలం | జాతకం | దిన ఫలాలు | వార్షిక ఫలాలు | జాతక పొంతనలు | ప్రశ్నలు- సమాధానాలు | మాస ఫలాలు | టారెట్ | వార ఫలాలు
ప్రధాన పేజి ఆధ్యాత్మికం » భవిష్యవాణి » వాస్తు శాస్త్రం » గృహవాస్తును అనుసరించి ఇంటి నిర్మాణం
వాస్తు శాస్త్రం
Feedback Print Bookmark and Share
 
నూతన గృహ నిర్మాణం చేపట్టినప్పుడే వాస్తు మీద ప్రత్యేక దృష్టి పెట్టి భవిష్యత్‌లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవటం ఎంతో ముఖ్యం. పునాది వేయటం దగ్గర్నుంచి స్లాబు పని పూర్తయ్యే వరకూ వాస్తు దోషాలు తలెత్తుకుండా చూసుకోవాలి. ఒకవేళ ఏదైనా అనుమానం తలెత్తినట్లైతే వాస్తులో మంచి ప్రావీణ్యం ఉన్నవారిని సంప్రదించాలి. ఇల్లు కట్టిన తర్వాత వాస్తు దోషం ఉంటే దానిని సరిచేయటం ఎంతో కష్టం. దీనివల్ల పెద్ద మొత్తంలో డబ్బు వృధా కావటమే కాక కాలయాపన జరుగుతుంది.

కనుక వాస్తు దోషాలు తలెత్తకుండా ముందుగానే కొన్ని ప్రధాన విషయాలను పరిగణలోకి తీసుకుంటే వాస్తు దోషానికి ఎంతమాత్రం ఆస్కారమే ఉండదు. ఇల్లు కట్టించటం మొదలు పెట్టిన దగ్గర్నుంచి వివిద స్టేజిలలో యజమాని ఈ విషయాలను సరిచూసుకుంటూ ఉంటే సరిపోతుంది. ఇల్లు, బావి లేదంటే బోరు వేసే సమయంలో మార్కింగ్ ఖచ్చితంగా ఉందో లేదో సరిచూసుకోవాలి. బీములు వేసే ముందు అవి ప్లాను ప్రకారం ఉన్నాయో లేదో చూసుకోవటం ఉత్తమం.