రత్నాల శాస్త్రం | పంచాంగం | వాస్తు శాస్త్రం | ఫెంగ్ షుయ్ | తారాఫలం | జాతకం | దిన ఫలాలు | వార్షిక ఫలాలు | జాతక పొంతనలు | ప్రశ్నలు- సమాధానాలు | మాస ఫలాలు | టారెట్ | వార ఫలాలు
ప్రధాన పేజి ఆధ్యాత్మికం » భవిష్యవాణి » వాస్తు శాస్త్రం » గృహవాస్తును అనుసరించి ఇంటి నిర్మాణం
వాస్తు శాస్త్రం
Feedback Print Bookmark and Share
 
ఇరుకైన చిన్న స్థలంలో ఇల్లు కట్టే వారు, విదిక్కులు తిరిగిన స్థలాలో ముఖ్యంగా తూర్పు ఆగ్నేయం, ఉత్తర వాయవ్యాలలో మెట్లు పెట్టాలనుకునే వారు మరింత శ్రద్ధ వహించాలి. మెట్లు మార్కింగ్ చేసేటప్పుడు ఈ విషయాలపై దృష్టి కేంద్రీకరించటం ఎంతైనా అవసరం. అలాగే శ్లాబు వేసే ముందు దాని వాటం ఎలా ఉంది.. బాల్కనీలో ఎలా ఉందీ అన్న విషయాలు ముందుగా ప్లాన్‌లో వేసుకున్న విధంగా సరిగా ఉన్నాయో లేదో చూసుకోవటం తప్పనిసరి.

పునాదులు మొదలుపెట్టి గోడలు నిర్మించేటప్పుడు ఎన్ని కిటికీలు పెట్టాలి అన్న విషయం దగ్గర్నుంచి కిటికీలు ద్వారాలకు సరిపోయే విధంగా మార్కు చేశారా, అలమరాలు ఎలా అమరుస్తున్నారన్నదాన్ని తప్పకుండా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. గోడలు నిర్మించి అటకులు కట్టేటప్పుడు, ప్లాస్టరింగ్ చేసేటప్పుడు ప్లాను ప్రకారం జరుగుతుందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. అదే విధంగా ఫ్లోరింగ్ మొదలైనప్పుడు వాటం సరిగా ఉందా లేదా అనేది చూసుకోవాలి.

ఇంట్లో నిర్మించే సెప్టిక్ ట్యాంకులు, నీళ్ల సంపుల మార్కులు సరిగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఆ తర్వాత బయట అరుగులు కట్టే వారైతే వాటి మార్కింగ్‌ను కూడా దృష్టిలో ఉంచుకోవాలి. ఇల్లు పూర్తవుతున్న సమయంలో ప్లాను ప్రకారం అన్ని సరిపోయాయా లేదా అన్నది ఒకసారి చెక్ చేసుకోవాలి. చివరిసారిగా ఇంటి స్థలానికి ప్రహరీ గోడ అనుకున్న ప్రకారమే కట్టారా లేదా అన్నది చూడాలి. అదే విధంగా కాంపౌండ్ గోడలు పెట్టేటప్పుడు వాటి నిర్మాణం సరిగా ఉందో లేదో చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.