గృహ నిర్మాణాన్నిఅర్ధాంతరంగా ఆపడం శ్రేయస్కరమా?
శుక్రవారం, 29 జూన్ 2007( 19:09 IST )
ఇంటికి సంబంధించిన కాంపౌండ్ వాల్‌ను ఆపచ్చు కానీ గోడ కట్టు మాత్రం సరిగ్గా ఉండేటట్లు చూసుకోవాలి. పెద్ద యింటికి ప్లాను వేయించి అందులో కొంత ఇప్పుడు కట్టి భవిష్యత్తులో మిగిలిన దానిని కట్టుకోవచ్చు. శ్లాబు వాస్తురీత్యా వాటం సరిగా లేనప్పుడు శ్లాబుపై ప్లాస్టరింగ్‌లు, ఫినిషింగ్ల్ తప్పనిసరిగా చే యించాలి. ఇంటిలోపల ఉన్న టాయిలె ట్లు వాడకంలో ఉన్నప్పుడు తప్పనిసరిగా తలుపులు ఉండాలి. అదేవిధంగా గృహ ఆవరణలో మట్టి నింపే పని ఉన్నపుడు దానిని అసంపూర్ణంగా వదిపెట్టకూడదు.
మేడ మీద, మెట్ల మీద పిట్ట గోడలు కట్టకుండా ఆపకూడదు. బయట ద్వారాలకు తలుపులు పెట్టకుండా ఆపనే కూడదు. గృహ నిర్మాణం పూర్తయిన తర్వాత గృహప్రవేశం చేయకుండా ఉండకూడదు. గృహనిర్మాణం పూర్తయిన తరువాత గృహ ఆవరణలో ఆగ్నేయ, నైరుతీ,పశ్చిమ, వాయవ్య దిశలలో పెద్ద వృక్షాలను పూర్తిగా తొలగించకూడదు.