రత్నాల శాస్త్రం | పంచాంగం | వాస్తు శాస్త్రం | ఫెంగ్ షుయ్ | తారాఫలం | జాతకం | దిన ఫలాలు | వార్షిక ఫలాలు | జాతక పొంతనలు | ప్రశ్నలు- సమాధానాలు | మాస ఫలాలు | టారెట్ | వార ఫలాలు
ప్రధాన పేజి ఆధ్యాత్మికం » భవిష్యవాణి » వాస్తు శాస్త్రం » వివాహ సంప్రదాయాలు... వాటి వివరాలు
వాస్తు శాస్త్రం
Feedback Print Bookmark and Share
 
పెళ్లంటే.... పది కాలాల పాటు పిల్లా పాపలతో పచ్చగా చేసుకొనే కాపురానికి నిలువెత్తు గోపురం. దంపతుల నూరేళ్ల జీవితం వలపుల పంటగా మారాలంటే... అనుసరించాల్సిన వివాహ సంప్రదాయాల గురించి మన శాస్త్రాలేం చెబుతున్నాయో కాస్త క్లుప్తంగా తెలుసుకోండి.


ఒకే లగ్నమునకు ఇద్దరు అన్నదమ్ములకు గాని, అక్కాచెల్లెళ్లకు గానీ వివాహం చేయరాదు. ఒకే లగ్నంలో అబ్బాయికి, అమ్మాయికి వివాహం చేయరాదు.


కొడుకు ఉపనయనం, కూతురి వివాహం ఒకేసారి చేయవచ్చును.


కూతురి పెళ్లికంటే ముందుగా కుమారునికి ఉపనయనం చేయడం మంచిది.


ఒక కుమారునికి, ఒక కుమార్తెకు ఒకే సంవత్సరంలో వివాహం చేయుట శుభం.


ఇద్దరు కుమారులకు ఒకే సంవత్సరంలో ఉపనయనం, వివాహం చేయరాదు. ఇతర శుభకార్యాలు జరిపించవచ్చు.


ఒకే ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములకు ఒకే సమయంలో కల్యాణం లేదా ఉపనయనం చేయకూడదు.


అన్నాచెల్లెళ్లకు ఒకే లగ్నంలో ఒకే వేదిక మీద పెళ్లి చేయరాదు.


అమ్మాయి పెళ్లయిన తరువాత అబ్బాయి వివాహం చేయాలంటోంది మన శాస్త్రం.


ఇద్దరు అన్నదమ్ములకు అక్కాచెల్లెళ్లను ఇచ్చి వివాహం చేయరాదు.