రత్నాల శాస్త్రం | పంచాంగం | వాస్తు శాస్త్రం | ఫెంగ్ షుయ్ | తారాఫలం | జాతకం | దిన ఫలాలు | వార్షిక ఫలాలు | జాతక పొంతనలు | ప్రశ్నలు- సమాధానాలు | మాస ఫలాలు | టారెట్ | వార ఫలాలు
ప్రధాన పేజి ఆధ్యాత్మికం » భవిష్యవాణి » వాస్తు శాస్త్రం » వాస్తుతో వీధుల దిశలు
వాస్తు శాస్త్రం
Feedback Print Bookmark and Share
 
ఇల్లు కట్టుకునేందుకు కొన్న స్థలం ఏ దిశలో ఉందో తెలుసుకోవాలని ఉందా? అయితే వెంటనే దానికి ఉన్న వీధులను చూడండి. వీటిని బ్లాకులంటారు. ఈ బ్లాకుల ఆధారంగా దిశలను ఎలా గుర్తించవచ్చో తెలుసుకుందాం...

మీ స్థలానికి పశ్చిమ, దక్షిణ వీధులుంటే ఆ స్థలాన్ని నైరుతి బ్లాకు అంటారు. ఈ బ్లాకులో పశ్చిమంగా ఉండే వీధి దక్షిణం నుంచి ఉత్తరం వైపుకు పల్లంగా ఉండాలి. అలాగే దక్షిణం వీధి పశ్చిమం నుండి తూర్పు వైపుకు పల్లంగా ఉండడం మంచిది. నైరుతి బ్లాకు నైరుతి వైపుకన్నా ఆగ్నేయం మూలన పల్లంగా ఉండాలి. అలాగే ఆగ్నేయం కన్నా వాయవ్యం వైపు పల్లంగా ఉండేటట్టు చూసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఈశాన్యం వైపు అన్నిటికన్నా పల్లంగా తయారై చక్కని ఫలితాలు వస్తాయి.

నైరుతి బ్లాకులో నైరుతి వైపున పల్లంగా ఉంటే కనుక అన్నింట్లో అపజయాలు, ఆత్మహత్యలు సంభవించే అవకాశాలు ఉన్నాయి. అంతే కాకుండా నైరుతి మూల పెరిగినా కూడా ఇటువంటి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. నైరుతి బ్లాకుకు నైరుతి వైపున ఏ దిశ నుంచి కూడా వీధి పోటు ఉండకుండా చూసుకోవాలి. లేదంటే ఆ ఇల్లు వాస్తు ప్రకారం నిర్మించినప్పటికీ, చెడు ఫలితాలే కనిపిస్తాయి.