ప్రధాన పేజి   ఆధ్యాత్మికం > భవిష్యవాణి > వాస్తు శాస్త్రం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
వాస్తుతో గృహానికి ద్వార అమరిక
మీరు కట్టుకుంటున్న ఇల్లు పూర్తి కావస్తోందా ? అయితే మరి వాటికి ద్వారాలు కిటికీలు పెట్టాలి కదా! అలాగే వాటిని వాస్తు ప్రకారం ఏ విధంగా, ఏ సంఖ్యలో పెట్టాలో తెలుసుకోండి... ఆ విధంగా ఆయా మూలలలో అమర్చుకుని విజయాలను సాధించండి.

ఇంటికి అమర్చే ద్వారాలు, కిటికీల సంఖ్య పదిలోపు ఉండాలి. అది కూడా సరైన సంఖ్యగా ఉండాలి. అంటే 2,4,6,8 ఈ తరహాలో పెట్టుకోవాలి. ద్వారాల, కిటికీలను మొత్తంగా గోడలకు ఆనుకుని ఉండకుండా చూసుకోవాలి. కనీసం నాలుగు అంగుళాలైనా ఉండేట్టు జాగ్రత్త పడండి.

అలాగే వీటిని ఏర్పాటు చేసే సమయంలో ఒకదానికొకటి ఎదురుగా ఉండాలి. అది కూడా బేసి సంఖ్యలో కాకుండా సరి సంఖ్యలో ఉండటం మంచిది. అలాగే బాత్రూంలకు, పూజగదులకు నిర్మించే సమయంలో వీటికి కూడా ద్వారాలు పెడుతుంటారు. అయితే వీటిని పరిగణనలోకి తీసుకోకూడదు. ఇవి మాత్రమే కాకుండా ప్రహరీగోడలకు పెట్టే ద్వారాలు కూడా లెక్కలోకి రావు.

ఇంటిలో కాకుండా ఆ స్థలంలోనే నిర్మించే, అంటే స్టోర్ రూమ్, గెస్ట్ హౌస్‌లకు పెట్టే ద్వారాలు కనీసం రెండైనా ఉండాలి. మన ఇంటిలో ఏడు ద్వారాలు నిర్మించి స్టోర్ రూంకు ఒక ద్వారం పెట్టి దీంతో ఎనిమిది ద్వారాలు అయ్యాయని భావించరాదు. ఓ చిన్న ఇంటిలో ద్వారం పెట్టాల్సి వచ్చినప్పుడు తూర్పు - ఈశాన్యంలో లేక ఉత్తర - ఈశాన్యంలో కానీ పెట్టాలి. ఉత్తర - దక్షిణ వైపున అమర్చకూడదు.

ద్వారాల అమరికలో మరికొన్ని విషయాలను వచ్చే వారం తెలుసుకుందాం










మరిన్ని
వాస్తుతో వీధుల దిశలు
వాస్తుతో ఎటాచ్డ్ బాత్‌రూములు
వాస్తుతో స్థలాల సవరణలు
వాస్తుతో దిశల భాగాల గుర్తింపు
ఇంటి నిర్మాణ సమయంలో...
గృహంలో పూజగది ఏర్పాటు