తూర్పుదిశకు అధిపతి ఇంద్రుడని వాస్తు శాస్త్రాలు పేర్కొంటున్నాయి. ఇంద్రుడు సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తాడని జ్యోతిష్కుల వాదన. ఈ దిశలో ఇంటినిర్మాణం చేయడం ద్వారా సకల సౌభాగ్యాలు చేరువవుతాయని వారు అంటున్నారు. తూర్పు దిశలో ఇంటినిర్మాణం జరిగినట్లైతే, ఆ గృహంలో అన్నపానాదులు, సంతాన సౌభాగ్యములు లభిస్తాయని ప్రతీతి.
అదేవిధంగా గృహానికి తూర్పుదిక్కున ఖాళీ స్థలము ఉన్నట్లైతే, అఖండ అష్టైశ్వర్యాలకు ఆ ఇల్లు నిలయమవుతుంది. అంతేకాకుండా నిరంతర అన్నదాన పరాయణులై సుఖింపగలరని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అయితే తూర్పు దిశయందు స్థలము తగ్గినట్లైతే సంతాన నష్టములు, వంశనాశనము, కరువు, దారిద్ర్యం ఫలాలు తటస్థిస్తాయని వాస్తు శాస్త్రజ్ఞులు అంటున్నారు.
|