ప్రధాన పేజి   ఆధ్యాత్మికం > భవిష్యవాణి > వాస్తు శాస్త్రం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
వాస్తు ప్రకారం బాత్‌రూం అమరిక  Search similar articles
ఇంటి నిర్మాణంలో పూర్వం టాయిలెట్లను ఇంటి వెనుక ప్రదేశంలో నిర్మించడం పరిపాటి. అయితే నానాటికి పెరుగుతోన్న నాగరికతకు అనుగుణంగా అటాచ్డ్ బాత్‌రూంలను ప్రతి గదిలోనూ నిర్మించుకోవడం వాడుకైంది. ఇందులో భాగంగా అటాచ్డ్ బాత్‌రూంలను వాస్తు ప్రకారం ఏవిధంగా నిర్మించుకోవాలనే వివరాలను పరిశీలిస్తే... గృహనిర్మాణం సమయంలో పడకగదిని నైరుతి మూలలో నిర్మించడం ఆవశ్యకమని వాస్తు చెబుతోంది.

అలా నిర్మించినట్లైతే గృహంలోనే నివసించే వారికి అష్టైశ్వర్యాలు చేరువవుతాయని వాస్తునిపుణులు అంటున్నారు. అయితే నైరుతి పడకగదికి అటాచ్డ్ బాత్‌రూం నిర్మించాల్సి వచ్చినప్పుడు తూర్పు వైపుగా దక్షిణపు గోడను ఆనుకుని ఉండే విధంగా బాత్‌రూం నిర్మించాలి. ఇలా నిర్మించిన బాత్‌రూంలోని దక్షిణగోడకు వెంటిలేటర్ నిర్మించాలి. అలాగే ఈ బాత్‌రూంకు వాయువ్యంలో తలుపును బిగించాలి.

నైరుతి వైపు నుండి తూర్పుభాగం వైపు దక్షిణ గోడను ఆనుకుని నిర్మించిన పడకగదిలో దక్షిణంవైపు తల ఉండేలా నిద్రించే ఏర్పాటు చేసుకోవడం ఉత్తమం. అదేసమయంలో నైరుతీ వైపున రెండు బెడ్‌రూంలు కట్టాల్సి వచ్చినప్పుడు వాస్తు ప్రకారం బాత్‌రూంల నిర్మాణం కాస్త మారుతుంది.

ఈ సమయంలో తొలుత నైరుతీలో ఓ గదిని కట్టి దానికి తూర్పు వైపున రెండు బాత్‌రూంలు నిర్మించాలి. అలాగే రెండో బాత్‌రూంను ఆనుకుని తూర్పువైపున మరో పడకగదిని నిర్మించుకోవడం మంచిదని వాస్తునిపుణులు అంటున్నారు.
మరిన్ని
తూర్పుదిశలో ఇంటి నిర్మాణం: ఫలితాలు
వాస్తు ప్రకారం గృహాలంకరణ దోషములు
వాస్తుప్రకారం భూ పరీక్ష!
గోడలవల్ల కలుగు చెడుఫలితాలు
ఇంటి నిర్మాణంలో రంగుల ఎంపిక
గృహావరణలో వృక్షస్థితి దోషాలు