దక్షిణ దిశకు అధిపతి యముడు. ఈయనను "అంతకుడు" అనే పేరుతో కూడా పిలుస్తారని జోతిష్కులు అంటున్నారు. గృహానికి దక్షిణ దిశయందు ఖాళీ స్థలము పెరిగినట్లుండినచో ఆ గృహము నందు నివసించే వారికి నాశనము సంభవించునని వాస్తు పేర్కొంటుంది.
ఈ ప్రభావంతో పీడకలలు, శతృబాధలు, యుద్ధములు, పశు-ధన-సుత నష్టములు, అగౌరవము వంటివి సంభవిస్తాయి. దక్షిణ దిశయందు స్థలము తగ్గియున్నట్లైతే.. యముని యుక్తాముక్త విచక్షణతో అన్ని విషయములందు సమముగా ప్రవర్తించు స్వభావము కల్గి సత్సీలము కలవారగుదురని వస్తు చెబుతోంది.
ఇక దక్షిణ స్థలమునందు నివసించే వారు.. వినవిధేయులుగా ఉంటారు. పౌరుషం, గర్వం కలిగి ఉన్న వీరు.. ఇతరులను గౌరవించి తాముకూడా గౌరవించబడుతారు. నూతనమైన పద్ధతులను అనుసరించుటు, నూతనాశయములు కలిగి ఉండుట వీరికి ఇష్టము. పరుల ఆజ్ఞలను ఆచరించు శక్తి, ఆజ్ఞాపింపగల ఠీవిని కలిగి ఉంటారని వాస్తు అంటోంది. ప్రభుత్వ ఉద్యోగములను అలంకరించే వీరికి శతృ ప్రాబల్యము అధికముగా ఉండును.
|