ప్రధాన పేజి   ఆధ్యాత్మికం > భవిష్యవాణి > వాస్తు శాస్త్రం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
మీ కోసం... కొన్ని "వాస్తు సలహాలు"  Search similar articles
FILE
ఉదయం నిద్రలేవగానే ఉత్తర దిశవైపున చూడటం వలన కుబేరస్థానాన్ని చూసినట్లవుతుందని వాస్తు నిపుణులు పేర్కొంటున్నారు. ఇలా చూడటం వలన ధనాదాయం ఎప్పుడు సంవృద్ధిగా ఉంటుందని వాస్తు నమ్మకం. పడక నుంచి దిగగానే తూర్పుదిశగా నడకసాగించటం మంచిదని, దీనివలన ఆనుకున్న పనులు ఆటంకాలు లేకుండా జరుగుతాయని వాస్తు చెబుతోంది.

ఇలా చేయడం ద్వారా మంచి లాభాలు పొందుతారని వాస్తు సూచిస్తోంది. లెట్రిన్‌లో-దక్షిణాభిముఖంగా గానీ ఉత్తరాభిముఖంగా గానీ కూర్చోవాలని, తూర్పు, పడమరలకు అభిముఖంగా కూర్చోకూడదని తెలుపుతోంది. గృహాన్ని చిమ్మేటప్పుడు ఈశాన్యంలో ప్రారంభించి నైరుతి వైపునకు చెత్తను పోగుచేయాలని, ఈశాన్యదిక్కునకు చెత్తను తీసుకురాకుడదని వాస్తు నిపుణులు వెల్లడిస్తున్నారు.

ఆగ్నేయమూల వంట చేయునప్పుడు- తూర్పు అభిముఖంగా నిల్చుని వంట చేయాలని శాస్త్ర సమ్మతం. ఇంటిని చిమ్మే చీపురు శని ఆయుధమని, అతని చేతిలో చీపురు ఎత్తిపట్టుకొనబడి ఉంటుందని, కాగా మనము చీపురును గోడకు ఆనించేటప్పుడు చీపురు పట్టుకొనే భాగాన్ని పైకి మాత్రమే నిలబెట్టి ఉంచటం శుభప్రదమని వాస్తు శాస్త్రం తెలుపుతోంది.

ఈశాన్యంలో దేవుని మందిరాలు నిర్మించి పూజ చేయరాదని, ఇలా చేయడం వలన ఈశాన్యం మూతపడటం జరుగుతుందని వాస్తుశాస్త్రం చెబుతోంది. తూర్పు గోడలోనే దేవుని గూడును ఏర్పాటు చేసుకోవడం క్షేమదాయకమని వాస్తుశాస్త్రజ్ఞులు అంటున్నారు.
మరిన్ని
దక్షిణ దిశా స్థలము : ఫలితాలు
ఇళ్లనిర్మాణానికి స్థలమునందలి హెచ్చుతగ్గులు
ఆగ్నేయ స్థలము : ఫలితాలు
స్థలాన్ని ఎన్నుకోవటం ఎలా?
వాస్తు ప్రకారం బాత్‌రూం అమరిక
తూర్పుదిశలో ఇంటి నిర్మాణం: ఫలితాలు