గృహమును నిర్మించుకోదలచినపుడు వాస్తుశాస్త్రము తెలిపిన కొన్ని నియమాలను పాటించడం మంచిది. నిర్మించిన గృహముల సముదాయమును వాస్తుశాస్త్రజ్ఞులు ఎనిమిది రకాలుగా విభజించారు. వీటినే "ఆయములు" అని పిలుస్తున్నారు. అందులో 1 ధ్వజయము, 2 ధూమాయము, 3 సింహాయము, 4 శ్వానాయము, 5 వృషభాయము, 6 ఖరాయము, 7 గజాయము, 8 కాకాయము తదితరాలు. వీటిలో బేసిసంఖ్యగల ధ్వజ, సింహ, వృషభ, గజాయములు తదితరాలు గృహమును కట్టుకొనుటకు యోగ్యములైనవని వాస్తు శాస్త్రము వెల్లడిస్తోంది.
సరిసంఖ్యలు గల ఆయములు గృహనిర్మాణమునకు పనికిరానివని వాస్తు తెలుపుతోంది. నిర్మించదలచుకున్న ఇంటి పొడవు కొలతను, అడ్డపు కొలతతో హెచ్చింది దానిని 9చే హెచ్చించి 8 చే భాగించగా వచ్చుశేషమును ఆయ సంఖ్యకాగలదని వాస్తుశాస్త్రము వెల్లడింస్తోంది. పొడవును అడ్డముచే హెచ్చింపగా వచ్చుకొలతను పదమని, క్షేత్ర కృతమనియు, గృహపిండమనియు అంటారని వాస్తు శాస్త్రము తెలుపుతోంది.
ఈ పదమును బట్టియో నవవర్గులు లేక షోడషవర్గు ఏర్పడుచున్నవని, ఈ వర్గులయందు శుభాదిక వర్గులు కొలతలు గృహనిర్మాణమునకు యోగ్యత కల్గినవని వెల్లడించుచున్నది. ఈ పదము నిర్మించుగృహము యోక్క గర్భమున వరకే పరిమితమని కొందరు, గృహమంతటికి పదము కట్టవలెనని మరి కొందరు శాస్త్రజ్ఞులు వెల్లడిస్తున్నారు.
కాగా ఈ నిర్ణయములందు వాస్తు శాస్త్రజ్ఞుల్లోను, ప్రజాల్లోనూ అనేక అభిప్రాయబేధాలున్నాయి. ఆంధ్రదేశము నందలి దక్షిణ ప్రాంతముల వారు మాత్రము గృహమువరకే పదనిర్ణయము చేయుదురని వాస్తు శాస్త్రము తెలుపుతోంది.
వాస్తుశాస్త్రము నందు ఈ పదములు లేక గృహపిండ మత్యంత ప్రాధాన్యము వహించియున్నది. ఈ పదము ననుసరించియే ఆ గృహము యోక్కసకల శుభకార్యాల లెక్కింపుకు వీలు కలుగుతుంది.
పదసంఖ్యను వీవిధ సంఖ్యలతో హెచ్చించి మరికొన్ని నిర్ణీత సంఖ్యలచే భాగించుట వలన ఆ గృహమునకు సంభవించు ఆయుర్థాయము, ధనము, ఋణము, కళ, అంశ తదితర విషయాలు తెలియగలవు. వీటిద్వారా ఆగృహము యజమానికి యోగ భాగ్యాలు లెక్కించుటకు ఉపయోగపడునని వాస్తునిపుణులు అంటున్నారు.
|