రత్నాల శాస్త్రం | పంచాంగం | వాస్తు శాస్త్రం | ఫెంగ్ షుయ్ | తారాఫలం | జాతకం | దిన ఫలాలు | వార్షిక ఫలాలు | జాతక పొంతనలు | ప్రశ్నలు- సమాధానాలు | మాస ఫలాలు | టారెట్ | వార ఫలాలు
ప్రధాన పేజి ఆధ్యాత్మికం » భవిష్యవాణి » వాస్తు శాస్త్రం » గృహ నిర్మాణంలో ద్వారాల అమరిక
వాస్తు శాస్త్రం
Feedback Print Bookmark and Share
 
WD
ఇంట్లో నడిచేటప్పుడు కొన్ని దిశలవైపు నడక సాగించడం శుభ ఫలితాలను ఇస్తుంది. ఉత్తర ఈశాన్యం నుండి, దక్షిణ ఈశాన్యం వైపుకు, దక్షిణ ఆగ్నేయం నుండి ఉత్తర ఈశాన్యం వైపు నడక సాగించడం శుభ ఫలితాలను ఇస్తుంది. తూర్పు ఈశాన్యం నుండి పడమర వాయువ్యం, పడమర వాయువ్యం నుండి తూర్పు ఈశాన్యం వైపుకు కూడా నడక సాగించడం మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ విధంగా దిశల వారీగా ద్వారాలను అమర్చుకోవడం ఉత్తమమని వాస్తు నిపుణులు అంటున్నారు.

ఉత్తర, దక్షిణ భాగాల మధ్యలో కూడా ద్వారాలను ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే తూర్పు, పడమర భాగాల మధ్యలో కూడా ద్వారాలను ఏర్పాటు చేయవచ్చు. పశ్చిమ, దక్షిణాలలో కూడా ఉచ్చ స్థానాలయిన పశ్చిమ వాయువ్యం, దక్షిణ ఆగ్నేయాలలో కూడా ద్వారాలను అమర్చవచ్చు. దీనివల్ల ఏ దోషం రాదు.

ఒక చిన్న ఇంటికి ఒకే ద్వారాన్ని అమర్చవలసి వచ్చినప్పుడు తూర్పు ఈశాన్యంలోగానీ, ఉత్తర ఈశాన్యంలోగానీ నిర్మించాలి. ఉత్తర, దక్షిణ భాగాలలో మాత్రం అమర్చకూడదు. గృహానికి రెండు ద్వారాలు మాత్రమే ఏర్పాటు చేయవలసి వస్తే వాటిని తూర్పు ఈశాన్యంలో ఒకటి, ఉత్తర ఈశాన్యంలో మరొకటి నిర్మించుకోవాలి. అంతేగానీ ఒకటి తూర్పు, ఉత్తరాల్లో అమర్చి, రెండోదాన్ని పడమర, దక్షిణం భాగంలో అమర్చకూడదని వాస్తు నిపుణులు అంటున్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: ఆధ్యాత్మికం భవిష్యవాణి వాస్తు శాస్త్రం శుభ ఫలితాలు ఈశాన్యం గృహ నిర్మాణం ద్వారాల అమరిక