రత్నాల శాస్త్రం | పంచాంగం | వాస్తు శాస్త్రం | ఫెంగ్ షుయ్ | తారాఫలం | జాతకం | దిన ఫలాలు | వార్షిక ఫలాలు | జాతక పొంతనలు | ప్రశ్నలు- సమాధానాలు | మాస ఫలాలు | టారెట్ | వార ఫలాలు
ప్రధాన పేజి ఆధ్యాత్మికం » భవిష్యవాణి » వాస్తు శాస్త్రం » నైరుతి బ్లాక్‌‌‌లో ఇంటి నిర్మాణం: శుభ, అశుభ ఫలితాలు
వాస్తు శాస్త్రం
Feedback Print Bookmark and Share
 
FILE
స్థలానికి పశ్చిమ, దక్షిణ వీధులుంటే ఆ స్థలమును నైరుతి బ్లాక్ అంటారు. పశ్చిమంలో ఉండు వీధి దక్షిణం నుండి ఉత్తరానికి పల్లంగానూ, దక్షిణం వీధి- పశ్చిమం నుండి తూర్పునకు పల్లంగానూ ఉంటే మంచిది.

నైరుతి బ్లాక్‌‌లో నైరుతి పల్లమైతే.. మతిభ్రమణము, ఆత్మహత్యలు సంభవిచడం వంటి అరిష్టాలు సంభవించడం జరుగుతాయి. నైరుతి బ్లాక్‌కు నైరుతి భాగంలో ఏ వైపు నుండి గానీ వీధిపోటు ఉండకూడదని వాస్తు శాస్త్రం చెబుతోంది.

ఇటువంటి వీధిపోట్లు ఉంటే, ఆ స్థలములో ఇంటిని వాస్తు ప్రకారం నిర్మించినా అశుభ ఫలితాలను కలిగిస్తుంది. నైరుతిదిశలో వర్షపు నీరు నిలిచిన అశుభములు కలుగుతాయి. నైరుతి గది ద్వారము పడమర దిశగా చూస్తే శుభప్రదమని వాస్తు శాస్త్రజ్ఞులు అంటున్నారు.

నైరుతి సరిహద్దులో నిర్మాణము చేపట్టినట్లైతే మంచి ఫలితాలు చేకూరుతాయి. అయితే నైరుతి భాగములో ఆఫీసు గది నిర్మించకూడదు. కరెంట్ మీటర్లు నైరుతిలో ఉండకూడదు. గ్యారేజ్‌లు, పార్కింగ్ నైరుతిలో నుండినట్లైతే శుభఫలితాలు కలుగును.

ఇంటి స్లాబ్‌ నైరుతిలో అన్నిటికన్నా ఎత్తుగా ఉంటే శుభఫలితాలనిస్తుంది. ఈ నైరుతి దిశలో మేడమెట్లు శుభములను కలిగిస్తాయి. నైరుతి దిశయందు సరిహద్దు నిర్మాణం చేసిన శుభములు కలుగుతాయి. నైరుతి దిశ యందు వరండాలు ఉండకూడదు.

డైనింగ్ టేబుల్ ఈ దిశలో ఉండకూడదు. నైరుతి దిశవైపు నిలబడి వంటలు చేయకూడదు. నైరుతిలో బరువైన సామాన్లు, వస్తువులు, బీరువాలు పెట్టడం మంచిదని వాస్తునిపుణులు అంటున్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: ఆధ్యాత్మికం భవిష్యవాణి వాస్తుశాస్త్రం స్థలం పశ్చిమ దక్షిణ వీథులు స్థలము నైరుతి బ్లాక్ శుభం అశుభ ఫలితాలు