రత్నాల శాస్త్రం | పంచాంగం | వాస్తు శాస్త్రం | ఫెంగ్ షుయ్ | తారాఫలం | జాతకం | దిన ఫలాలు | వార్షిక ఫలాలు | జాతక పొంతనలు | ప్రశ్నలు- సమాధానాలు | మాస ఫలాలు | టారెట్ | వార ఫలాలు
ప్రధాన పేజి ఆధ్యాత్మికం » భవిష్యవాణి » వాస్తు శాస్త్రం » గృహాల్లో మెట్లను నిర్మించటం ఎలా?
వాస్తు శాస్త్రం
Feedback Print Bookmark and Share
 
FILE
మెట్లను నిర్మించటంలో కొన్ని పద్ధతులను పాటించాలని వాస్తు శాస్త్రాలు తెలుపుతున్నాయి. వాస్తు శాస్త్రం ప్రకారం మెట్లను ఏవిధంగా నిర్మిస్తే శుభదాయకాలనే అంశాలను పరిశీలిస్తే..

1. మేడపైకి మెట్లు నిర్మించేటపుడు ఒక వరుస మెట్లను... తూర్పు నుండి పడమరకు లేదా, ఉత్తరం నుండి దక్షిణానికి ఎక్కే విధంగా నిర్మించాలి.

2. రెండు వరుసలుగా నిర్మించేటపుడు.. మొదటి వరుస మెట్లను.. తూర్పు నుండి పడమరకు వెళ్ళే విధంగానూ, రెండవ వరుస మెట్లు ఏ దిక్కుకైనా తిరిగినా పడమర నుండి తూర్పుకు ఎక్కే విధంగా నిర్మించాలి.

3. రెండు వరుస మెట్లను నిర్మించేటపుడు ఒక వరుస ఉత్తరం నుండి దక్షిణం వైపు ఎక్కేవిధంగాను, రెండవ వరుస.. ఎటు తిరిగినా దక్షిణము నుండి ఉత్తరం ఎక్కేవిధంగా నిర్మించుకోవచ్చు.

4. మెట్లను "ఎల్" ఆకారంలో ఉండే విధంగా నిర్మించాలనుకునే వారు ముందు తూర్పు నుండి పడమరకు గానీ, లేదా ఉత్తరం నుండి దక్షిణానికి గానీ ఎటువైపుకైనా నిర్మించుకోవచ్చు.

5 గృహానికి వెలుపలి భాగంలో నిర్మించదలచే వారు... ఈశాన్య, వాయవ్య, నైఋతి, ఆగ్నేయాలలో ఏ భాగంలో నైనా నిర్మించుకోవచ్చు.

6. ఈశాన్య దిక్కుగా మెట్లను నిర్మించేటప్పుడు గృహానికి తూర్పు, ఈశాన్యము, లేదా ఉత్తర- ఈశాన్యాలవైపు నిర్మించుకోవచ్చు.

7. ఈశాన్యం వైపు నిర్మించే మెట్లు ప్రహరీ గోడకు సమీపంలో ఉండకూడదని వాస్తు శాస్త్రజ్ఞులు వెల్లడించారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: ఆధ్యాత్మికం భవిష్యవాణి వాస్తుశాస్త్రం మెట్లు నిర్మించటం పద్ధతులు పాటించటం వాస్తు శాస్త్రాలు