ఇంటి నిర్మాణానికి అనుకూలమైన స్థలాలను మాత్రమే ఎంపిక చేసుకోవాలని వాస్తు శాస్త్రాలు పేర్కొంటున్నాయి. అందులో ముఖ్యంగా భారతీయ వాస్తు శాస్త్రాలు తెలిపిన, గృహనిర్మాణానికి పనికిరాని స్థలాలను గురించి పరిశీలిస్తే...
1. స్థలములోని నాలుగు భుజములు హెచ్చుతగ్గులుగా ఉన్నా, నాలుగు భుజాల కంటే ఎక్కవ భుజాలు కలిగి ఉన్న స్థలం గృహ నిర్మాణానికి పనికిరాదు. ఇలాంటి స్థలంలో ఇంటి నిర్మాణం చేపడితే అశుభాలను కలుగుతాయని వాస్తు చెబుతోంది.
2. స్థలము లోని పొడవు ఎక్కువగా ఉండి, భుజములు హెచ్చు తగ్గులుగా ఉండే స్థలం కూడా మంచిది కాదు. ఈ స్థలంలో ఇంటి నిర్మాణం జరిగితే పశుహాని, అనారోగ్యం కలిగిస్తుంది.
3. అదే విధంగా చేట ఆకారంలో గల స్థలం కూడా ఇంటి నిర్మాణానికి మంచిది కాదు. ఎంత సంపాదించినా నిలువ ఉండటం అసాధ్యం. క్రమంగా దారిద్ర్యానికి దారితీస్తోంది. నిరంతరం మానసిక అశాంతికి గురికావటం కూడా జరుగుతుందని వాస్తు శాస్త్రజ్ఞులు అంటున్నారు.
4. ఇకపోతే... డమరకపు ఆకారంలో ఉండే స్థలము మంచిది కాదు. ఇలాంటి నేలలో ఇంటినిర్మాణం చేపడితే సంతానం కలగటంలో సమస్యలు నేత్ర సంబంధిత రోగాలు కలుగుతాయి.
5. లాగుడు బండి ఆకారంలో ఉండే స్థలము ఆర్థిక పతనానికి దారి తీస్తోంది.
6. కుంభాకార స్థలం, భయం, అంటు వ్యాధులు, సుఖశాంతులు లోపించటం జరుగుతుంది.
7. విసన కర్ర ఆకార స్థలం... ఎటువంటి ఆస్తిమంతుల్నైనా ఆర్థికంగా అణగారిపోయేలా చేస్తుంది.
8.మద్దెల ఆకారంలో గల స్థలాలు భాగస్వాముల మధ్య వివాదాలను విడిపోయే ఆస్కారాలను అధికంగా కలిగిస్తాయి.
9.అర్థ చంద్రాకార స్థలాల వలన మానసిక భ్రాంతి కలుగుతుంది. తరచుగా దోపిడీలు జరుగుతుంటాయని వాస్తు శాస్త్రం చెబుతోంది.