రత్నాల శాస్త్రం | పంచాంగం | వాస్తు శాస్త్రం | ఫెంగ్ షుయ్ | తారాఫలం | జాతకం | దిన ఫలాలు | వార్షిక ఫలాలు | జాతక పొంతనలు | ప్రశ్నలు- సమాధానాలు | మాస ఫలాలు | టారెట్ | వార ఫలాలు
ప్రధాన పేజి ఆధ్యాత్మికం » భవిష్యవాణి » వాస్తు శాస్త్రం » చీపురును ఎలా పెడుతున్నారు...?
వాస్తు శాస్త్రం
Feedback Print Bookmark and Share
 
భారతీయ వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని సలహాలను పాటిస్తే, జీవితంలో పురోగమన మార్గాల్లో పయనించే అవకాశాలు కలుగుతాయని వాస్తు శాస్త్ర నిపుణులు పేర్కొంటున్నారు. మీకోసం వాటిలో కొన్ని...

1. ఉదయం నిద్రలేవగానే ఉత్తర దిశ(కుబేర స్థానం)ను చూడటం మంచిది. దీనివలన ధనాదాయం లభిస్తుంది.
2. పక్కమీద నుండి దిగగానే తూర్పువైపుకు కొంచెం నడక సాగించటం ద్వారా తలపెట్టిన పనులు నిర్విఘ్నంగా కొనసాగుతాయని వాస్తు నిపుణులు అంటున్నారు.

3. గృహాన్ని చిమ్మేటప్పుడు ఈశాన్యం నుంచి నైఋతి వైపుకు చిమ్మి చెత్తను పోగు చేయండి. ఈశాన్యం వైపు చెత్త తీసుకురాకూడదని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఈశాన్యం వైపు చెత్తను పోగు చేస్తే ఆ గృహంలో సంపద నిలకడగా ఉండదని విశ్వాసం.

4. ఆగ్నేయ మూల వంట చేసేటప్పుడు.. తూర్పు అభిముఖంగా నిల్చుని వంట చేయాలి.
5. ఇంటిని చిమ్మే చీపురు శనీశ్వరుని ఆయుధం. అందుచేత గోడకు ఆనించేటప్పుడు చీపురు హ్యాండిల్ పైకి మాత్రమే పెట్టి ఉంచటం శుభకరం.

6. ఈశాన్య మూలలో దేవుని మందిరాలు నిర్మించటం చేయకూడదు. దీనివలన ఈశాన్య మూల మూతపడుతుంది... అది శుభదాయకం కాదు. గృహంలో ఈశాన్య మూల మూతపడకుండా చూసుకోవడం ద్వారా సకల సంపదలు చేకూరుతాయి. ఈశాన్య దిక్కు మూతపడ్డట్లైతే అశుభ ఫలితాలు సంభవిస్తాయి.

7. ప్రత్యేకంగా పూజగదిని ఏర్పాటు చేసుకోలేని పక్షంలో... తూర్పువైపు గల గోడలోనే పూజ అలమరను అమర్చుకోవడం శుభప్రదమని వాస్తు చెబుతోంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: ఆధ్యాత్మికం భవిష్యవాణి వాస్తు శాస్త్రం భారతీయ కొన్ని సలహాలు జీవితం పురోగమనం కుబేర స్థానం చీపురు నైఋతి