రత్నాల శాస్త్రం | పంచాంగం | వాస్తు శాస్త్రం | ఫెంగ్ షుయ్ | తారాఫలం | జాతకం | దిన ఫలాలు | వార్షిక ఫలాలు | జాతక పొంతనలు | ప్రశ్నలు- సమాధానాలు | మాస ఫలాలు | టారెట్ | వార ఫలాలు
ప్రధాన పేజి ఆధ్యాత్మికం » భవిష్యవాణి » వాస్తు శాస్త్రం » పరిశ్రమలను ఏర్పాటు చేస్తున్నారా?
వాస్తు శాస్త్రం
Feedback Print Bookmark and Share
 
FILE
వ్యాపార రీత్యా అభివృద్ధి సాధించేందుకు వాస్తు శాస్త్రం పేర్కొంటున్న నియమాలను పాటించడం మంచిదని ఆ శాస్త్ర నిపుణులు అంటున్నారు. పరిశ్రమలను వాస్తు ప్రకారం ఏర్పాటు చేసుకున్నట్లైతే శుభ ఫలితాలు కలుగుతాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. పరిశ్రమల ఏర్పాటుకు వాస్తు చెబుతున్న కొన్ని నియమాలు మీ కోసం...

పరిశ్రమను నిర్మించే స్థలానికి దక్షిణం పడమర ఎత్తయిన కొండలుగాని, లేక దక్షిణం నుండి ఉత్తరానికి వాలుగాగానీ, పడమర నుండి తూర్పుకు వాలుగా గానీ ఉంటే లాభాలు చేకూరుతాయని వాస్తు చెబుతోంది. తూర్పు, ఉత్తర దిశలలో వాగులు, కాలువలు, ఉపనదులు గానీ ఉంటే చాలా మంచిది. పరిశ్రమలు నిర్మించే స్థలం నలుచదరంగా ఉంటే పరిశ్రమ ఏర్పాటుకు అది అనువైన స్థలమని వాస్తు శాస్త్రం చెబుతోంది.

ఎరుపు నేల, గరప నేల, రాతినేలల్లో పరిశ్రమలు నిర్మిస్తే శ్రేయస్కరమని వాస్తు నిపుణులు అంటున్నారు. అదే విధంగా స్థలం దీర్ఘ చతురస్రాకారం లేదా చతురస్రాకారం కలిగి ఉండటం కూడా చాలా మంచిదని వారు పేర్కొంటున్నారు.

ఇకపోతే... రెండు రోడ్లు గల ఫ్లాట్ పరిశ్రమలకు మంచిది. తూర్పు, పడమర దిశలో రోడ్లు వున్నపుడు, తూర్పు రోడ్డు కంటే పడమర రోడ్డు మెరకగా ఉండాలి. అదే విధంగా ఉత్తర, దక్షిణం వైపు రోడ్లు గల ప్లాటుకు ఉత్తర రోడ్డు కంటే దక్షిణ రోడ్డు మెరకగా ఉండాలి. తూర్పు ఉత్తరంలో రోడ్లు వున్నపుడు రెండు రోడ్లు ఒకే లెవల్‌గా ఉండి, ప్లాటు రోడ్డు కంటే మెరకగా ఉండాలి.

దక్షిణం, పడమర రోడ్లు వున్నపుడు రెండు ఒకే లెవల్‌ ఉండి ప్లాటు రోడ్ల కన్నా పల్లంగా ఉండాలి. ప్లాటులో నైరుతి కోణం 90డిగ్రీలు వచ్చే విధంగా సరిచూసుకోవాలి. ప్లాటును కొంచెం ఈశాన్యం వైపు తిరిగేవిధంగా మిగిలిన దిక్కులను సరిచేసుకోవాలి.

దక్షిణం, పడమర ప్రహరీలను, ఫెన్సింగ్‌లు ఏర్పరచినట్లైతే, ఈశాన్యంలో బోరు తవ్విన తరువాత పరిశ్రమ నిర్మాణం మొదలు పెట్టాలి. ఒకవేళ ఈశాన్యంలో నీరు దొరకకపోతే, తూర్పు, ఉత్తరాలలో బావిని తవ్వేందుకు ప్రయత్నించవచ్చు. ఆ దిక్కుల్లోనూ నీరు దొరకని పక్షంలో పడమర, దక్షిణం నైరుతి వాయువ్య, ఆగ్నేయం ఏ దిక్కులోనైనా నీరు లభిస్తే... బోరు వున్న స్థలాన్ని ప్రధాన స్థలమునుండి విడగొట్టి ఆ నీటిని పైపుల ద్వారా ఈశాన్యానికి తరలించి అక్కడినుంచే పరిశ్రమకు వాడుకోవాలి.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: ఆధ్యాత్మికం భవిష్యవాణి వాస్తుశాస్త్రం పరిశ్రమ ఏర్పాటు రెండు రోడ్లు గల ఫ్లాట్ ఎరుపు గరప రాతి నేలలు