ఇంట్లో నడక ఏ విధంగా ఉంటే మంచిది అనే విషయంపై చాలా మందికి సందేహాలు తలెత్తడం సహజం. ఇది వినడానికి హాస్యాస్పదంగా ఉన్నా కూడా వాస్తు ప్రకారం ఇది కూడా చాలా ముఖ్యమైన విషయమే.
వాస్తులో తూర్పు, ఉత్తర దిశలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. నడక విషయంలో కూడా అంతే... పడమర నుంచి తూర్పు లేదా దక్షిణ ఆగ్నేయం నుంచి ఉత్తర ఈశాన్యం వైపు నడవడం వల్ల ఆ ఇంట్లో సిరులు కురుస్తాయని వాస్తు శాస్త్రజ్ఞులు అంటున్నారు.
దక్షిణం నుంచి తూర్పు ఈశాన్యం లేదా ఉత్తరం వైపు ఉండే గుమ్మాల ద్వారా సాగిపోయే నడక చాలా మంచిది. పశ్చిమ వాయువ్య -తూర్పు ఈశాన్య నడక వల్ల ఎన్నో లాభాలుంటాయని వాస్తు వివరిస్తోంది. ఇవి తప్పనించి వేరు ఎటువైపునైనా నడక సాగిస్తే... దానివల్ల నష్టమే తప్ప లాభం ఏ మాత్రం ఉండదని వాస్తు శాస్త్రం పేర్కొంటోంది.