రత్నాల శాస్త్రం | పంచాంగం | వాస్తు శాస్త్రం | ఫెంగ్ షుయ్ | తారాఫలం | జాతకం | దిన ఫలాలు | వార్షిక ఫలాలు | జాతక పొంతనలు | ప్రశ్నలు- సమాధానాలు | మాస ఫలాలు | టారెట్ | వార ఫలాలు
ప్రధాన పేజి ఆధ్యాత్మికం » భవిష్యవాణి » వాస్తు శాస్త్రం » పాతబడిన ఇళ్లను కొనుగోలు చేస్తున్నారా?
వాస్తు శాస్త్రం
Feedback Print Bookmark and Share
 
FILE
ఇల్లు తీసుకునే ముందు వాస్తును చూసి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలా చూసినప్పుడు ఏవైనా దోషాలు ఉన్నట్లైతే సరిచేసుకునే వీలుంటుంది. ఒకవేళ సరిచేయడానికి వీలులేని ఇళ్లను కొనుగోలు చేసినట్లైతే సమస్యలు మనమే కొని తెచ్చుకున్నట్లే.

కొందరు పాతబడిన ఇంటిని కొనుగోలు చేసి ఆ ఇంటిని కూల్చివేసి వాటి స్థానంలో కొత్తగా ఇళ్ల నిర్మాణం చేపడతారు. ఇలా చేసే ముందు స్థలాన్ని కూడా వాస్తుపరంగా సరిచేసి ఆ తర్వాత మాత్రమే గృహనిర్మాణం చేయాలని వాస్తు శాస్త్రం చెబుతోంది.

ఆస్తి పంపకం జరిగిన తర్వాత కొందరు ఉమ్మడి ఇళ్లను పోర్షనులుగా విభజించి పాత గోడలపైనే ఇళ్ల నిర్మాణం చేపడుతుంటారు. అయితే ఇటువంటి సమయాల్లో కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవలసి ఉంటుంది. కొత్త ఇల్లు నిర్మాణానికి ఏ సూచనలైతే పాటిస్తారో వాటినే పాటించాలన్నది వాస్తు నియమం.

ఒక ఇంటిని ఒకటి కంటే ఎక్కువ పోర్షన్లుగా విభజించినప్పుడు దక్షిణ, పశ్చిమ దిశల్లో పెద్దవారు, ఉత్తర తూర్పు దిశల్లో చిన్నవారు ఉండాలన్నది వాస్తు నిబంధన. అదే విధంగా.. ఇంటిని పోర్షన్లుగా విభజించకుండా ఇంటి మొత్తాన్ని ఒక్కరే తీసుకోవటం ఉత్తమం. మిగిలినవారు ఆస్తికి సమానంగా నగదును పంచుకుంటే ఏ సమస్య ఉండదని వాస్తు చెబుతోంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: ఆధ్యాత్మికం భవిష్యవాణి వాస్తు శాస్త్రం పాతబడిన ఇళ్లు కొనుగోలు ఉమ్మడి పోర్షన్లు