రత్నాల శాస్త్రం | పంచాంగం | వాస్తు శాస్త్రం | ఫెంగ్ షుయ్ | తారాఫలం | జాతకం | దిన ఫలాలు | వార్షిక ఫలాలు | జాతక పొంతనలు | ప్రశ్నలు- సమాధానాలు | మాస ఫలాలు | టారెట్ | వార ఫలాలు
ప్రధాన పేజి ఆధ్యాత్మికం » భవిష్యవాణి » వాస్తు శాస్త్రం » ఇంట్లో గేట్ల అమరిక ఎలా ఉండాలి?
వాస్తు శాస్త్రం
Feedback Print Bookmark and Share
 
FILE
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటికి సంబంధించి పలు విషయాలను పరిగణనలోకి తీసుకున్నట్లుగానే కొత్తగా నిర్మించబోయే గృహానికి సంబంధించి గేట్లను కూడా వాస్తు ప్రకారమే ఏర్పాటు చేసుకోవడం ఉత్తమం.

కాబట్టి వాస్తు ప్రకారం ఉత్తరం వైపు రోడ్డు ఉన్న ఇంటికి ప్రహరీగోడ కూడా అదే వైపుగా ఏర్పరచుకోవడం మంచిది. ఇలా ఏర్పరుచుకున్నట్లైతే ఆ గృహంలో సంపద సమృద్ధిగా ఉంటుంది.

అదే విధంగా.. ఉత్తరం వైపు ఉన్న ఇంటికి, ముఖ ద్వారానికి ఎదురుగా ఒక చిన్న గేటును బిగించుకోవాలి. ఈశాన్య దిక్కులో మాత్రం మెయిన్ గేటును అమర్చుకుంటే మంచిది. ఈ రెండు గేట్ల గుండా కూడా తప్పనిసరిగా రాకపోకలు సాగించాలి.

అలాగే దక్షిణం దిశలో రెండు గేట్లను ఏర్పాటు చేసుకోవాలని భావిస్తే ఇంటి ముఖ ద్వారానికి ఎదురుగా చిన్న గేటును ఏర్పాటు చేయాలి. మెయిన్ గేటును మాత్రం దక్షిణ ఆగ్నేయ భాగంలోనే ఏర్పరచాలి.

తూర్పు దిక్కుగా గేట్లు ఏర్పరచుకోవాలంటే ఇంటి ప్రధాన గుమ్మానికి ఎదురుగా ఒక చిన్న గేటును బిగించుకుంటే మంచి ఫలితాలు చేకూరుతాయి.

ఇకపోతే... ఇంటికి ఈశాన్య దిశగా మెయిన్ గేటును బిగించుకోవచ్చు. చిన్నగేటు ద్వారానైనా, లేదా మెయిన్ గేట్ ద్వారానైనా రాకపోకలు సాగించవచ్చు. కానీ మెయిన్ గేటును మాత్రం ఎలాంటి పరిస్థితుల్లోనూ మూతవేయకూడదని వాస్తు శాస్త్రం చెబుతోంది.

పశ్చిమం దిశగా రోడ్డు కలిగి ఉండే గృహానికి పశ్చిమ దిశలో గేట్లను బిగించుకోవాలంటే సింహ ద్వారానికి ఎదురుగా ఒక గేటు ఉండాలి. పశ్చిమ వాయువ్యంలో మరో గేటును ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే చిన్న గేటు ద్వారా రాకపోకలు తక్కువగా ఉండేలాగా, మెయిన్ గేటు ద్వారా రాకపోకలు ఎక్కువగా ఉండేలాగా ఏర్పాటు చేసుకోవాలని వాస్తు నిపుణులు అంటున్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: ఆధ్యాత్మికం భవిష్యవాణి వాస్తుశాస్త్రం ఇంట్లో గేట్ల అమరిక ఉత్తరం వైపు రోడ్డు ప్రహరీగోడ