రత్నాల శాస్త్రం | పంచాంగం | వాస్తు శాస్త్రం | ఫెంగ్ షుయ్ | తారాఫలం | జాతకం | దిన ఫలాలు | వార్షిక ఫలాలు | జాతక పొంతనలు | ప్రశ్నలు- సమాధానాలు | మాస ఫలాలు | టారెట్ | వార ఫలాలు
ప్రధాన పేజి ఆధ్యాత్మికం » భవిష్యవాణి » వాస్తు శాస్త్రం » కొత్త ఇంటి నిర్మాణాన్ని సగంలోనే ఆపేశారా?
వాస్తు శాస్త్రం
Feedback Print Bookmark and Share
 
FILE
కొత్తగా నిర్మించే గృహాలను ఆర్థిక ఇబ్బందులు, ఇతర అనివార్య కారణాల వల్ల నిర్మాణాన్ని సగంలోనే ఆపివేయాల్సి వస్తుంది. ఇలా నిర్మాణాన్ని అర్థాంతరంగా ఆపివేయటం వల్ల అనేక దోషాలను ఎదుర్కోవాల్సి వస్తుందని వాస్తు శాస్త్రం చెబుతోంది.

ఇబ్బందులు, సమస్యలు వస్తే కొన్ని రకాల నిర్మాణ పనులను మాత్రమే ఆపివేయాలే కానీ... మరి కొన్ని నిర్మాణాలను మాత్రం తప్పకుండా పూర్తి చేయాల్సి ఉంటుందని వాస్తు నిపుణులు అంటున్నారు.

ఇందులో భాగంగా... ఇంటి లోపల గదులకు ద్వారాలు, కిటికీలు, కప్‌ బోర్డులు, షో కేసులు తదితర వాటికి సంబంధించిన చెక్కపనులను సగంలో ఆపవచ్చు. ఇల్లు కట్టేటప్పుడు ఇంటి లోపల మొసైక్ ఫ్లోరింగ్‌లను ఆపవచ్చు కానీ... ఆర్డినరీ గచ్చువాటాన్ని వాస్తు రీత్యా వేయాలి. ఇంటిలోపల టాయ్‌లెట్‌ కోసం గది నిర్మించినప్పటికీ లోపల పనిముట్లు పెట్టకుండా వాయిదా వేయవచ్చు.

పూజ గది కట్టిన తర్వాత దానిలోని అలంకరణకు సంబంధించిన పని... అంటే టైల్సు వేయటం వంటి మొదలైన పనులను వాయిదా వేసుకోవచ్చు. గ్రిల్స్‌కు సంబంధించిన ద్వారాలు, కాంపౌండ్‌ గేట్ల నిర్మాణాన్ని ఆపుకోవచ్చు.

శ్లాబు వాస్తురీత్యా వాటం సరిగా లేనప్పుడు శ్లాబుపై ప్లాస్టరింగ్‌లు, ఫినిషింగ్ల్‌ తప్పనిసరిగా చేయించాలి. ఇంటిలోపల ఉన్న టాయిలెట్లు వాడకంలో ఉన్నప్పుడు తప్పనిసరిగా తలుపులు ఉండాలి.

ఇంటికి గచ్చు వేయించే దాకా మట్టి కొట్టుకుపోకుండా జాగ్రత్త పడాలి. అదే విధంగా మెట్లు కట్టకుండా వాయిదా వేసుకోవచ్చు. కిటకీలకు గుమ్మాలకు రంగులు వేయటం ఆపేయవచ్చు. మేడ మీద, మెట్ల మీద పిట్ట గోడలు కట్టకుండా ఆపకూడదు. బయట ద్వారాలకు తలుపులు పెట్టకుండా ఇంటి నిర్మాణం ఆగిపోకుండా జాగ్రత్త పడాలి.

ఇంటికి సంబంధించిన కాంపౌండ్‌ వాల్‌ను ఆపచ్చు కానీ గోడ కట్టు మాత్రం సరిగ్గా ఉండేటట్లు చూసుకోవాలి. గృహ నిర్మాణం పూర్తయిన తర్వాత గృహప్రవేశం చేయకుండా ఉండకూడదు. అదే విధంగా గోడలు నిర్మించి పైకప్పు (మోల్డింగ్) వేయకుండా ఆపేస్తే ఆ ఇంటికి శుభప్రదం కాదని వాస్తు నిపుణులు అంటున్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: ఆధ్యాత్మికం భవిష్యవాణి వాస్తుశాస్త్రం ఆర్థిక ఇబ్బందులు కొత్త ఇంటి నిర్మాణం సగం