రత్నాల శాస్త్రం | పంచాంగం | వాస్తు శాస్త్రం | ఫెంగ్ షుయ్ | తారాఫలం | జాతకం | దిన ఫలాలు | వార్షిక ఫలాలు | జాతక పొంతనలు | ప్రశ్నలు- సమాధానాలు | మాస ఫలాలు | టారెట్ | వార ఫలాలు
ప్రధాన పేజి ఆధ్యాత్మికం » భవిష్యవాణి » వాస్తు శాస్త్రం » వాహనాలను ఎలా పార్కింగ్ చేస్తున్నారు? (Astrology, vastu, Cars, Scooters)
వాస్తు శాస్త్రం
Feedback Print Bookmark and Share
 
FILE
నాగరికత పెరిగిపోతున్న నేటి ఆధునికయుగంలో స్కూటర్లు, కార్లు మొదలైన వాహనాల వాడకం అధికమైంది. దాదాపుగా ప్రతి ఒక్కరి దగ్గరా ఉంటున్న ఈ వాహనాల్లో అనేక సమస్యలు, లోపాలు వస్తుండటం గమనిస్తుంటాం.

వాహనాలను పార్కింగ్ చేసుకునే స్థలాల ఎంపిక ద్వారా కూడా ఇటువంటి సమస్యలు వస్తాయని వాస్తు శాస్త్రజ్ఞులు వెల్లడిస్తున్నారు. వాస్తు ప్రకారం వాహనాల పార్కింగ్ నియమాలను గురించి పరిశీలిస్తే...

ఉత్తరం, తూర్పు దిశల్లో ఎక్కువ కాలం పాటు వాహనాలను ఆపి ఉంచకూడదు. ఈ దిక్కులో వాహనాలను ఎక్కువ కాలంపాటు ఆపి ఉంచితే అప్పుడప్పుడు వాహనాల్లో లోపం ఏర్పడి లేని పోని సమస్యలకు దారి తీస్తాయి. అంతేకాకుండా ఆ వాహనాలను అమ్మే స్థితికి చేరుకుంటారు.

ఇంటికి ఉత్తరం, తూర్పు ప్రాంతాలను పార్కింగ్ దిక్కులుగా వాస్తు శాస్త్రాలు సూచిస్తున్నాయి. దీని ప్రకారం వాహనాలను తూర్పు, ఉత్తరం ప్రాంతాల్లో పార్కింగ్ చేయడం ఉత్తమం. ఇలా చేస్తే వాహనాల్లో ఎటువంటి సమస్యలు తలెత్తవు.

ఇంటికి ఉత్తర, పశ్చిమ దిక్కుల్లో వాహనాలను నిలిపేందుకు షెడ్లను ఏర్పాటు చేయవచ్చు. పాడైన వాహనాలను తూర్పు. దక్షిణం, పశ్చిమ దిశలుగా ఆపవచ్చు.

పైన పేర్కొన్న విధంగా వాస్తు ప్రకారం పార్కింగ్ ప్రాంతాలను ఎంచుకున్నట్లైతే వాహన ప్రమాదాలను, వాహన లోపాలను ఎదుర్కొనవచ్చునని వాస్తు శాస్త్రజ్ఞులు అంటున్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: ఆధ్యాత్మికం భవిష్యవాణి వాస్తుశాస్త్రం వాహనాలు పార్కింగ్ స్కూటర్లు కార్లు సమస్యలు లోపాలు