రత్నాల శాస్త్రం | పంచాంగం | వాస్తు శాస్త్రం | ఫెంగ్ షుయ్ | తారాఫలం | జాతకం | దిన ఫలాలు | వార్షిక ఫలాలు | జాతక పొంతనలు | ప్రశ్నలు- సమాధానాలు | మాస ఫలాలు | టారెట్ | వార ఫలాలు
ప్రధాన పేజి ఆధ్యాత్మికం » భవిష్యవాణి » వాస్తు శాస్త్రం » ఏ దిశలో తలవుంచి నిద్రిస్తున్నారు..?
వాస్తు శాస్త్రం
Feedback Print Bookmark and Share
 
FILE

మీ గృహంలో దక్షిణ, నైరుతి, పశ్చిమ, ఉత్తర దిశలలో పడకగదులు నిర్మించడం మంచిదని వాస్తుశాస్త్రం చెబుతోంది. తూర్పు, ఆగ్నేయ, ఈశాన్య దిశలలో పడక గదుల నిర్మాణం మంచిది కాదు. పడక గదిలో మంచాలు దక్షిణ-పశ్చిమ-ఉత్తర-నైరుతి-వాయువ్య దిశలలో ఉండవచ్చునని వాస్తు నిపుణులు అంటున్నారు.

ఏ గదినైనా ఉత్తర-ఈశాన్య-తూర్పు దిశలలో నడకకు కొంత ఖాళీ స్థలం వుంచాలి. మంచాలు, కుర్చీలు, సోఫాలు, బీరువాలను పై దిశలలో గోడలకు ఆనించి మూతవేయకూడదు. ధనం, ఆభరణాదులు గల బీరువాలను దక్షిణ, పశ్చిమ దిశ గోడలకు ఆన్చి, ఉత్తర-తూర్పు దిశలకు ఎదురుగా అమర్చుకోవాలి.

ఎట్టి పరిస్థితుల్లోనూ ఉత్తర దిశలో తలవుంచి నిద్రించడం మంచిది కాదు. ఇలా నిద్రిస్తే దుష్పలితాలు కలుగుతాయని వాస్తుశాస్త్రం చెబుతోంది. ఇకపోతే.. తూర్పు, పశ్చిమ, దక్షిణ దిశలలో తలవుంచి నిద్రించడం శ్రేయస్కరం.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: ఆధ్యాత్మికం భవిష్యవాణి వాస్తు శాస్త్రం దక్షిణం నైరుతి పశ్చిమం ఉత్తరం దిశ పడకగది తల నిద్ర