రత్నాల శాస్త్రం | పంచాంగం | వాస్తు శాస్త్రం | ఫెంగ్ షుయ్ | తారాఫలం | జాతకం | దిన ఫలాలు | వార్షిక ఫలాలు | జాతక పొంతనలు | ప్రశ్నలు- సమాధానాలు | మాస ఫలాలు | టారెట్ | వార ఫలాలు
ప్రధాన పేజి ఆధ్యాత్మికం » భవిష్యవాణి » వాస్తు శాస్త్రం » పూజగది ఎక్కడ ఉండాలి...? (Where puja griha should be..!)
వాస్తు శాస్త్రం
Feedback Print Bookmark and Share
 
FILE
ప్రస్తుతం ప్రతివారు వాస్తు శాస్త్రాన్ననుసరించి ఇంటి నిర్మాణం చేపడుతున్నారు. వాస్తుననుసరించి నిర్మాణం చేపట్టే ఇండ్లలో కార్యాభివృద్ధి, ధనాభివృద్ధి, సుఖ శాంతులు విరాజిల్లుతాయి. ప్రతి ఇంట్లోనూ పూజగది అనేది ఉంటుంది. పూజగదిని నిర్మించేటప్పుడు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలంటున్నారు వాస్తు నిపుణులు.

పూజగదిని నిర్మంచేటప్పుడు వాస్తు నియమాలను దృష్టిలో పెట్టుకుంటే ఎంతో మంచిది. పూజగదికి దిక్కు, స్థలం మొదలైనవి వాస్తు శాస్త్రాన్ననుసరించి నిర్మాణం చేసుకోవాలని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.

** ఇంట్లోని పూజగది ఉండే ప్రాంతంలో శౌచాలయం, స్టోర్ రూం లాంటివి నిర్మాణం చేపట్టకూడదు. పూజగది పైన లేదా క్రింది భాగంలో శౌచాలయ నిర్మాణాలుండకూడదు.

** వాస్తు శాస్త్రాన్ననుసరించి పడక గదిలో పూజగదిని ఏర్పాటు చేసుకోకూడదు.

** పూజగదిలోనున్న విగ్రహాలు లేదా పటాలు ఉత్తర, దక్షిణ దిక్కును చూస్తుండేలా ఉంచకూడదు. దేవతల దృష్టి ఒకరిపై మరొకరి దృష్టి పడకుండా జాగ్రత్త పడేలా చూసుకోవాలంటున్నారు వాస్తు నిపుణులు. పూజగదికి తూర్పు లేదా పశ్చిమ దిక్కులో దేవతల విగ్రహాలు లేదా పటాలుండేలా చూసుకోవాలి.

** పూజగదికి కిటికీలు, తలుపులు పశ్చిమ దిక్కులో కాకుండా ఉత్తర లేదా తూర్పు దిక్కులో ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి. పూజగది తలుపుకు ఎదురుగా దేవతా విగ్రహాన్నికాని లేదా పటాన్ని కాని ఉంచాలి.

** పూజగదిలో తయారు చేసిన తలుపు కొయ్యతో చేసిది ఉండకూడదు.

** ఇంట్లోని పూజగదిలో గోపురం, కలశంలాంటివి నిర్మించకూడదు.

** తేలికపాటి పసుపు రంగును శుభసూచకంగా భావిస్తారు. కాబట్టి ఇంటి గోడలపై తేలికపాటి పసుపు రంగును వేస్తుంటారు. ఇలాంటి కొన్ని విషయాలపై శ్రద్ధ వహిస్తే చాలా మంచిదంటున్నారు వాస్తు నిపుణులు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: భవిష్యవాణి, వాస్తు శాస్త్రం, ఇంటి నిర్మాణం, పూజగది, శౌచాలయం, స్టోర్ రూం