రత్నాల శాస్త్రం | పంచాంగం | వాస్తు శాస్త్రం | ఫెంగ్ షుయ్ | తారాఫలం | జాతకం | దిన ఫలాలు | వార్షిక ఫలాలు | జాతక పొంతనలు | ప్రశ్నలు- సమాధానాలు | మాస ఫలాలు | టారెట్ | వార ఫలాలు
ప్రధాన పేజి ఆధ్యాత్మికం » భవిష్యవాణి » వాస్తు శాస్త్రం » గృహనిర్మాణం ఎప్పుడు చేపట్టాలి...? (House | construction | sun | planet | other planets |)
వాస్తు శాస్త్రం
Feedback Print Bookmark and Share
 
"గృహమేకదా స్వర్గసీమ" అన్నారు పెద్దలు. ఆ స్వర్గసీమ నిర్మాణాన్ని ఎప్పుడు ప్రారంభించాలి? ఇలాంటి సందేహాలు తలెత్తుతుంటాయి. అలాంటి సందర్భంలో గ్రహాలకు ఆద్యుడైన సూర్యుడు వివిధ రాశులలో సంచరిస్తుంటాడు. సూర్య గ్రహం వివిధ రాశులలో సంచరిస్తుంటే ఆయా మాసాలకు ఆయా పేర్లు పెట్టడం జరిగింది. ప్రస్తుతం గృహ నిర్మాణం ఎప్పుడు చేపట్టాలనే దానిపై జ్యోతిష్యులు తమ అభిప్రాయాలను ఇలాచెపుతున్నారు.

1** సూర్యగ్రహం మేష రాశిలో ఉన్నప్పుడు ఇంటి నిర్మాణం చేపడితే ఎంతో లాభదాయకం అంటున్నారు జ్యోతిష్యులు.

2** అదే వృషభరాశిలో సూర్యగ్రహం ఉన్నప్పుడు గృహ నిర్మాణం చేపడితే సంపద పెరుగుతుంది. ఆర్థికంగా పురోగతిని సాధిస్తారు.

3** మిథున రాశిలో సూర్యగ్రహం ఉన్నప్పుడు గృహ నిర్మాణం చేపడితే ఇంటి యజమానికి కష్టాలు తప్పవంటున్నారు జ్యోతిష్యులు.

4** కర్కాటక రాశిలో సూర్యగ్రహం ఉన్నప్పుడు ఇంటి నిర్మాణం చేపడితే, ఆ ఇంట్లో నివసించేవారు ధన-ధాన్యాలతో తులతూగుతుంటారు.

5** సింహరాశిలో సూర్యగ్రహం ఉన్నప్పుడు గృహ నిర్మాణం చేపడితే కీర్తి ప్రతిష్టలతోపాటు సేవకులుకూడా మీకు తగినట్లు నడుచుకుంటారు.

6** కన్యారాశిలో సూర్యగ్రహం ఉన్నప్పుడు ఇంటి నిర్మాణం చేపడితే ఆ ఇంట్లో నివసించేవారు రోగాలబారినపడి, చికాకుతో జీవనం సాగిస్తుంటారని జ్యోతిష్యులు సూచిస్తున్నారు.

7** తులారాశిలో సూర్యుడు ఉన్నప్పుడు గృహనిర్మాణం చేపడితే ఆ ఇంటి యజమాని, ఇంట్లో నివసించేవారు సుఖ సంతోషాలతో తమ జీవితాన్ని గడుపుతుంటారు.

8** వృశ్చిక రాశిలో సూర్యుడు ఉన్నప్పుడు గృహ నిర్మాణం చేపడితే ఆ ఇంట్లో నివసించే వారికి ధనవృద్ధి కలుగుతుంది.

9** ధనస్సు రాశిలో సూర్యుడు ప్రవేశించినప్పుడు ఇంటి నిర్మాణం చేపడితే ఆ ఇంటి యజమానికి పూర్తిగా నష్టం వాటిల్లడమే కాకుండా వినాశనానికి దారితీస్తుందంటున్నారు జ్యోతిష్యులు.
 
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: ఆధ్యాత్మికం, భవిష్యవాణి, వాస్తుశాస్త్రం, గృహ నిర్మాణం, స్వర్గసీమ, సూర్యగ్రహం