రత్నాల శాస్త్రం | పంచాంగం | వాస్తు శాస్త్రం | ఫెంగ్ షుయ్ | తారాఫలం | జాతకం | దిన ఫలాలు | వార్షిక ఫలాలు | జాతక పొంతనలు | ప్రశ్నలు- సమాధానాలు | మాస ఫలాలు | టారెట్ | వార ఫలాలు
ప్రధాన పేజి ఆధ్యాత్మికం » భవిష్యవాణి » వాస్తు శాస్త్రం » గృహనిర్మాణం ఎప్పుడు చేపట్టాలి...? (House | construction | sun | planet | other planets |)
వాస్తు శాస్త్రం
Feedback Print Bookmark and Share
 
10** మకర రాశిలో సూర్యుడు ప్రవేశించినప్పుడు గృహ నిర్మాణం చేపడితే ఇంటి యజమానికి, ఇంట్లో నివసిస్తున్నవారికి ధనం, వారి సంపదలో వృద్ధి కనపడుతుంది.

11** సూర్యుడు కుంభరాశిలోకి ప్రవేశించినప్పుడు ఇంటి నిర్మాణం చేపడితే ఆ ఇంట్లో నివసించేవారికి రత్నాలు, ఇతర ధాతువుల లాభం చేకూరుతుందంటున్నారు జ్యోతిష్యులు.

12** సూర్యుడు మీనరాశిలోనున్నప్పుడు ఇంటి నిర్మాణం చేపడితే ఇంటి యజమానికి నలువైపులా నష్టమే నష్టం అంటున్నారు జ్యోతిష్యులు.

ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించాలనుకుంటే శుక్లపక్షంలోనే ప్రారంభించాలి. ఫాల్గుణం, వైశాఖం, మాఘం, శ్రవణం, కార్తీక మాసాలలోనే ఇంటి నిర్మాణం చేపట్టాలి. దీంతో మంచి ఫలితాలను అందుకోవచ్చంటున్నారు జ్యోతిష్యులు.

చేయకూడనివి: గృహ నిర్మాణం చేపట్టాలనుకుంటే వీటిని కచ్చితంగా పాటించి తీరాలి. అవేంటంటే మంగళవారం, ఆదివారం రోజుల్లో, అమావాస్య వెళ్ళిన తర్వాత అలాగే పౌర్ణిమి మరుసటి రోజున, చతుర్థి, అష్టమి, నవమి, చతుర్దశి, అమావాస్య రోజులలో గృహ నిర్మాణం చేపట్టకూడదు.

అలాగే జ్యేష్ట్యా, మూల, రేవతీ నక్షత్రంలో ఉన్నప్పుడు గృహ నిర్మాణం చేపట్టకూడదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి జీర్ణోద్ధారణకాని, పునాదులు వేసే కార్యక్రమాలుకాని చేపట్టకూడదు. ఇలా చేస్తే ఫలితం ఉండదంటున్నారు జ్యోతిష్యులు.

శుభయోగాలను ఇచ్చేటివి : శనివారం, స్వాతి నక్షత్రం, సింహలగ్నం, శుక్లపక్షం, తిథి సప్తమీ, శుభయోగం, అలాగే శ్రావణమాసం ఇవన్నీకూడా ఒకే రోజులో వస్తే అలాంటి ముహూర్తంలో గృహనిర్మాణం చేపడితే ఆ ఇంట్లో దైవికం ఉట్టిపడటమే కాకుండా శుఖశాంతులకు నిలయంగా మారుతుంది. వీటితోబాటు ఈ ఇంట్లో నివసించే కుటుంబం ధనధాన్యాలతో తులతూగుతుందంటున్నారు జ్యోతిష్యులు.
 
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: ఆధ్యాత్మికం, భవిష్యవాణి, వాస్తుశాస్త్రం, గృహ నిర్మాణం, స్వర్గసీమ, సూర్యగ్రహం