మీ పడకగది ఎలా ఉంది?

శృంగారంలో సంతృప్తిపడిన భార్యాభర్తలు జీవితంలో ఎదురయ్యే చిన్నా చితకా ఆటుపోటులకు అంతగా గురికారని పెద్దలు చెబుతుంటారు. అందుకే భార్యాభర్తలుగా మారినవారిని ఎవరైనా మీ దాంపత్యం ఎలా ఉంది అని ప్రశ్నించినప్పుడు మీ శృంగార జీవితం ఎలా ఉందనే శ్లేష ఆ ప్రశ్నలో పరోక్షంగా కనిపిస్తుంటుంది.ఈ విధంగా దంపతుల జీవితంలో శృంగారానికి ప్రముఖ స్థానం ఉంది. కాబట్టే ఆ శృంగారానికి కేంద్రమైన పడకగది ఏర్పాటు గురించి ఆనాటి కామసూత్ర నుంచి నేటి ఆధునిక సైకాలజీ వరకు ఎన్నో రకాల సూచనలు చేసింది.అదేసమయంలో దంపతుల శృంగార జీవితానికి పునాది అయిన పడకగది ఏర్పాటు గురించి వాస్తుశాస్త్రం సైతం ఎన్నో సూచనలిస్తోంది. చక్కని శృంగార జీవితానికి, కలతలు లేని కాపురానికి అవసరమైన పడకగది ఏర్పాటు గురించి వాస్తు ఏం చెబుతోందంటే... పడకగదిలో మంచాన్ని ఎవరెవరి ఇష్టం వచ్చినట్లుగా ఎటుపడితే అలా వేసుకోవడం మంచిది కాదని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఎలా పడితే అలా మంచాన్ని వేసుకుంటే ఆరోగ్య, మానసిక విషయాల మీద చెడు ప్రభావం చూపే అవకాశం ఉందని వాస్తు నిపుణులు అంటున్నారు. వాస్తు ప్రకారం బెడ్‌రూమ్ తలుపులకు ఎదురుగా మంచాన్ని ఉంచకూడదు. అలాగే కిటికీలకు ఎదురుగా కూడా మంచం ఉండకూడదని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఎలాంటిపరిస్థితుల్లోనూ పడకగది మంచాన్ని ఏటవాలుగా ఉండే సీలింగ్ కిందకాని, స్థంబాల కిందకాని ఉంచకూడదు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో మంచాన్ని వేయాల్సి వస్తే రెండు వెదురు వేణువులను పైన వేలాడదీస్తే మంచిది.ఇకపోతే అద్దాన్ని కాని, డ్రెస్సింగ్ టేబుల్‌ని కాని మంచానికి తలవైపు గానీ, కాళ్లవైపు గానీ ఉంచకూడదు. ఎందుకంటే? మనం నిద్రించే సమయంలో శరీరం నుండి బయటకు వచ్చే ఆత్మ అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకుని కంగారు పడుతుందని వాస్తు శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. దీనిద్వారా లేనిపోని అనర్ధాలు జరిగే అవకాశాలున్నాయని వారు అంటున్నారు.అదేవిధంగా.. మీ బెడ్‌రూమ్‌లోని బెడ్‌ను ప్రతిఫలించేటట్లుగా ఉన్న అద్దాలను సైతం తొలగించి వేరే స్థానాల్లోకి మార్చండి. లేదా అద్దంపై ఒక తెర వేయండి. ఇంకా బెడ్‌రూమ్‌లో ఆక్వేరియం, నీళ్ళకు సంబంధించిన ఫోటోలు ఉంచకూడదని వాస్తునిపుణులు అంటున్నారు. దీనివల్ల భార్యా భర్తల మధ్య గొడవలు జరిగే ఆస్కారాలున్నాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. సంబంధిత సమాచారం కోసం శోధించండి.