రత్నాల శాస్త్రం | పంచాంగం | వాస్తు శాస్త్రం | ఫెంగ్ షుయ్ | తారాఫలం | జాతకం | దిన ఫలాలు | వార్షిక ఫలాలు | జాతక పొంతనలు | ప్రశ్నలు- సమాధానాలు | మాస ఫలాలు | టారెట్ | వార ఫలాలు
ప్రధాన పేజి ఆధ్యాత్మికం » భవిష్యవాణి » వాస్తు శాస్త్రం » మీ బెడ్రూంకి ఏ కలర్ వేశారూ...? (bed room | vastu | light colours)
వాస్తు శాస్త్రం
Feedback Print Bookmark and Share
 
WD
ఇల్లన్న తర్వాత దేవుడి గది, వంటగది, డైనింగ్ హాల్, పడక గది, డ్రాయింగ్ రూమ్, స్టడీ రూమ్ ఇలా ఎన్నో ఉంటాయి. ఇవి చిన్నవి కావచ్చు.. లేదంటే పెద్దవిగా కూడా ఉండవచ్చు. అయితే ప్రతి గదికీ ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఈ ప్రత్యేకత రంగుల ద్వారా, ఫర్నీచర్ ద్వారా ఆయా గదులలో ఉండే ఇతర వస్తువుల ద్వారా కనబడుతూ ఉంటుంది.

ఎవరి అభిరుచి వారిదే అయినా రంగుల వాడకంలో వాస్తు నియమాలు పాటిస్తే మంచిదంటున్నారు వాస్తు నిపుణులు. ఏయే గదికి ఏ రంగు వేస్తే బావుంటుందో తెలుసుకుని ఆ రంగులను గదులకు వేస్తే మంచిది.

మొదటగా పడకగదిని చూస్తే...
వాస్తు ప్రకారం పడక గదులకు లేత రంగు మంచిది. గోడలకు లేత గులాబీ, నీలం, ఆకుపచ్చ, బూడిద రంగులు ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. బుద్ధి వికసిస్తుంది. అలాగే పసుపు, తెలుపు మార్పుల్ స్టోన్స్‌ను ఫ్లోర్‌కి వాడితే వాస్తు కుదురుతుంది. ప్రశాంతంగా, నిశ్శబ్ద వాతావరణం ఉండేలా ఇవి చూస్తాయి. దంపతుల మధ్య ఎటువంటి సమస్యలు రావు. చక్కగా నిద్రపడుతుంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: బెడ్రూం, పడక గది, వాస్తు, రంగులు, లేత గులాబీ