రత్నాల శాస్త్రం | పంచాంగం | వాస్తు శాస్త్రం | ఫెంగ్ షుయ్ | తారాఫలం | జాతకం | దిన ఫలాలు | వార్షిక ఫలాలు | జాతక పొంతనలు | ప్రశ్నలు- సమాధానాలు | మాస ఫలాలు | టారెట్ | వార ఫలాలు
ప్రధాన పేజి ఆధ్యాత్మికం » భవిష్యవాణి » వాస్తు శాస్త్రం » పార్కులు, గార్డెన్లను ఇలా ఏర్పాటు చేసుకోండి (Vasthu| Park| Garden| Lake| River| Fish| Dragon| White Tiger)
వాస్తు శాస్త్రం
Feedback Print Bookmark and Share
 
FILE
పార్కులు, గార్డెన్లు ఉండే ప్రదేశాలను గుట్టలు రాళ్ల రప్పలతో పాటు.. ప్రకృతి సిద్ధమైన సరస్సు, లోయలతో వికృతంగా ఏర్పాటు చేయడం ప్రస్తుతం పరిపాటైంది. అయితే గార్డనింగ్ చేయడం ద్వారా అందం మాత్రమే గాక ఆరోగ్యదాయకమైన సదుపాయాలు కూడా ఉన్నాయని వాస్తుశాస్త్ర నిపుణులు అంటున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం 'చి' ప్రవాహం గల విధంగా పార్కులు అమర్చటం ద్వారా గృహ యాజమాన్యులకు సుఖవంతమైన జీవనం లభిస్తుంది.

గార్డెన్‌కు సమీపంలో కొలను ఏర్పాటు చేయటం అందులో చేపలు, తాబేళ్లను పెంచటం, వాటిపై ఆకర్షణీయమైన వంతెనలను, పుష్పాల మొక్కలను, అమర్చటం ద్వారా కూడా మంచి ప్రయోజనాలు లభిస్తాయి. అయితే ఈ అమరికకు సరియైన దిక్కులను ఎంపిక చేసుకోవాలి. ఇందులో భాగంగా.. ఉత్తరంలో కొండలను, రాళ్ల గుంటలను, దక్షిణాన కొలను, సరస్సులు, దక్షిణం-తూర్పు దిక్కుగా నీటి ప్రవాహం వుండేటట్టు అమర్చుకోవాలి.

మన గృహంలో ఉన్న స్థలంలోనే చిన్నపాటి కొలనును ఏర్పాటు చేసుకోవడం ద్వారా దుష్టశక్తుల నివారణకు వీలుంటుందని వాస్తు నిపుణులు అంటున్నారు. కొలనులో నీటి ప్రవాహం, కాలిబాటలను వంకర టింకరులుగా మలచటం మంచిది.

ఇకపోతే.. గార్డెన్‌లో ఉత్తరాన నల్లటి తాబేళ్లు, తూర్పున డ్రాగన్, పశ్చిమాన తెల్లపులి బొమ్మలను అమర్చటం ద్వారా మంచి శక్తులు మనల్ని కాపాడుతాయి. కొలను గట్టు మీద బెంచీలను ఏర్పాటు చేసుకోవటంలో చతురస్ర, గుండ్రం, పంచభుజాకారం, అష్టభుజాకారంగా అమర్చుకోనేలా చూసుకోవాలి.

గార్డెన్ లోపల ఈశాన్యంగా లేక నైరుతిగా దేవతా విగ్రహం అమర్చటం గాని చేయాలి. ఇంకా గార్డెన్‌లో చెట్లను నాటుకోవటంలో జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా "ఇన్" శ్రేణికి ద్రాక్షా, బొప్పాయి మొక్కలు కాగా, చామంతి, వెదురు, ఖర్జూరం వంటివి "యాంగ్" శ్రేణికి చెందినవి. ఇలా ఇన్ యాంగ్ విధానంలో నాటిన మొక్కల నుండి వెలువడే గాలి ఆరోగ్యానికి మంచిదని వాటి పచ్చదనం కంటికి మంచిదని వాస్తు శాస్త్రజ్ఞులు తెలుపుతున్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: పార్కులు, గార్డెన్లు, కొలను, సరస్సు, చేపలు, డ్రాగన్, తెల్లపులి