రత్నాల శాస్త్రం | పంచాంగం | వాస్తు శాస్త్రం | ఫెంగ్ షుయ్ | తారాఫలం | జాతకం | దిన ఫలాలు | వార్షిక ఫలాలు | జాతక పొంతనలు | ప్రశ్నలు- సమాధానాలు | మాస ఫలాలు | టారెట్ | వార ఫలాలు
ప్రధాన పేజి ఆధ్యాత్మికం » భవిష్యవాణి » వాస్తు శాస్త్రం » సెప్టిక్ ట్యాంకును వాయువ్య భాగంలో నిర్మించకండి! (Septic Tank | Vastu | Religion | Astrology | Panchang)
వాస్తు శాస్త్రం
Bookmark and Share Feedback Print
 
FILE
సెప్టిక్ ట్యాంకులను ఇంటికి వాయువ్య భాగంలో నిర్మించకూడదని వాస్తు నిపుణులు అంటున్నారు. దీనివలన బంధుమిత్రులతో కలహాలు కలుగుతాయి. అలాగే మానసిక రుగ్మతలు, చికాకులు కలుగుతాయి. అయితే సెప్టిక్ ట్యాంకులను ఉత్తర భాగంలో నిర్మించవచ్చును. అలాగే వాయువ్య భాగంలో బాత్‌రూమ్‌లు, మరుగుదొడ్లు నిర్మించుకోవచ్చు. అయితే వీటిని ఉత్తరపు గోడను ఆనుకోకుండా కట్టుకోవాలని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.

ఇంకా వాయవ్యంలో పశుశాలలను నిర్మించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. కానీ వాటిని పడమర గోడకు ఆనించి మాత్రమే కట్టాలి. గృహంలో వాయువ్య భాగంలో వంటగదిని కూడా నిర్మించుకోవచ్చు. అలాగే ఆగ్నేయ మూలలో తప్ప వేరే చోట వంట చేయరాదు. దీనివలన చెడు ఫలితాలు కలుగుతాయి.

ఇకపోతే.. వాయవ్యంలో గేట్‌పెట్టే అవకాశమున్నప్పుడు ఆ భాగములో మరుగుదొడ్లు నిర్మించకూడదు. కానీ పశ్చిమ-వాయవ్యపు గేట్ మంచి ఫలితాలనిస్తుంది. వాయువ్య భాగంలో మూత వేసి ఉంచకూడదు. వాయవ్య భాగంలో నూతులు, గోతులు వుండకూడదని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: సెప్టిక్ ట్యాంక్, వాస్తు శాస్త్రం, ఆధ్యాత్మికం, భవిష్యవాణి, పంచాంగం