తొలి ఝాము దాటి రెండు గంటల సమయంలో... దేవాలయంలోకి వెళ్లగానే దేవతామూర్తికి నిత్యం ధూప దీప నైవేద్యాలు జరుగుతున్న సంగతిని గ్రహించాము. శివలింగంపై కొబ్బరి ముక్కలను కుంకమ కనబడ్డాయి. దేవాలయంలో ఒక రాత్రంతా గడపాలని నిర్ణయానికి వచ్చాము. అర్ధరాత్రి కాగానే, ఇక్కడ ఉండడం మంచిది కాదు త్వరగా బయలుదేరండి అంటూ ముకేష్ మమ్మల్ని తొందరపెట్టారు. అయితే మేము దేవాలయంలోనే ఉండాలని బలవంత పెట్టటంతో అతడు మాతో పాటుగా కోటలో ఉండక తప్పలేదు.
ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అర్థరాత్రి దాటి... తొలి ఝాము కాగానే రెండు గంటల సమయంలో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో ఉష్ణోగ్రత హఠాత్తుగా పడిపోయింది. గతంలో నేను చదివిన పేరు గుర్తులేని పుస్తకంలోని ఒక వాక్యం నాకు కాకతాళీయంగా గుర్తుకు వచ్చింది. " ఎక్కడ ఆత్మలు తిరుగాడుతుంటాయో, అక్కడ ఉష్ణోగ్రత పడిపోతుంది ". మా బృందంలోని కొందరు భయపడిపోవడం ప్రారంభించారు.
అక్కడ పరిస్థితి భయానకంగా మారింది. సూర్యకిరణాలు పుడమిని తాకుతున్న సమయాన, ఉదయం నాలుగు గంటల వరకు మేము దేవాలయంలోనే గడిపాము. కొలనును చేరుకుంటూ ఉండగా... కొలనును పరిశీలించాల్సిందిగా హరున్ మాకు సూచించారు. కొలను వైపుకు అడుగులు వేసాం. అయితే అనుమానించాల్సిన అంశాలేవీ మాకు కనిపించలేదు. అయితే మమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేస్తూ దేవాలయంలోని శివలింగంపై గులాబీ పుష్పం అగుపించింది. అక్కడ పుష్పాన్ని ఎవరు ఉంచారో మాకు అర్థం కాలేదు. ఆ పని ఎవరైనా తుంటరి చేసారా లేక అశ్వద్ధామనా?
చర్చలో పాల్గొనాలని భావిస్తున్నారా? ఇక్కడ క్లిక్ చేయండి.
|