ప్రధాన పేజి   ఆధ్యాత్మికం > ఏది నిజం > కథనం
 
మద్యం సేవిస్తున్న కాలభైరవుని విగ్రహం
Wine bottle is included with prasad
Shruti AgarwalWD
మద్యసేవనం వెనుక రహస్యం గురించి దుకాణదారు రవివర్మను వాకబు చేయగా అతను ఇలా చెప్పాడు. " కాలభైరవుని కృపను కోరి వచ్చే ప్రతి భక్తుడు దేవునికి మద్యాన్ని నైవేద్యంగా సమర్పిస్తాడు. మద్యంతో నిండిన పాత్ర కాలభైరవ దేవుని నోటి వద్ద ఉంచిన మరుక్షణం, పాత్ర నుంచి మద్యం మాయమవ్వడం ప్రారంభమవుతుంది.”
ఫోటోగ్యాలరీకోసం ఇక్కడ క్లిక్ చేయండి
దేవాలయ ఆవరణలోకి ప్రవేశించగానే పెద్ద సంఖ్యలో భక్తుల కనిపించారు. ప్రతి ఒక్కరి చేతిలో ఉన్న బుట్టలో కొబ్బరికాయ, పుష్పాలతో పాటు మద్యం సీసా కూడా కనిపించింది. భైరవదేవుడు కొలువైన గర్భగుడిలో ఒక మూల నిల్చొని దేవుడు మద్యం ఎలా తాగుతాడో గమనించసాగాం...

గర్భగుడిలోని వాతావరణం వింతగా ఉంది. పూజారి గోపాల్ మహారాజ్ విగ్రహం ఎదుట నిలబడి శ్లోకాలు చదువుతూ మద్యంతో నిండిన పళ్లాన్ని కాలభైరవ విగ్రహం నోటి వద్ద ఉంచారు ... కలయో? వైష్ణవమాయయో...!! పళ్లెంలో ఒక్క చుక్క కూడా మద్యం మిగలలేదు...
Wine to kaalbhairava
Shruti AgarwalWD


మద్య నివేదన కార్యక్రమం అలా కొనసాగుతూనే ఉంది……అంతా మా కళ్లముందే జరుగుతోంది. సంభ్రమాశ్చర్యాలలో మేము మునిగిపోయాము.... పూజారి స్వహస్తాలతో అందిస్తుండగా విగ్రహం మద్యం సేవించసాగింది. ఈ విషయాన్ని భక్తులలో ఒకరైన రాజేష్ చతుర్వేదితో మేము చర్చించాము.

తాను ఉజ్జయిని నివాసినని ప్రతి ఆదివారం దేవాలయాన్ని సందర్శిస్తుంటానని రాజేష్ చెప్పారు. మొదట్లో తనకు కూడా మద్యం ఎటుపోతుందో తెలుసుకోవాలనే ఆసక్తి ఉండేదని, కానీ తర్వాత స్వీయఅనుభవంతో కాలభైరవ దేవుని విగ్రహమే మద్యాన్ని సేవిస్తోందన్న నమ్మకానికి వచ్చానని రాజేష్ తెలిపారు.
మీరు చర్చలో పాల్గొనాలని భావిస్తున్నారా? అయితే ఇక్కడ క్లిక్ చేయండి.
వీడియోను వీక్షించండి
 << 1 | 2 | 3  >> 
చిత్రమాల
కాలభైరవుని ఫోటోగ్యాలరీ
వెబ్ ప్రపంచం చర్చా వేదిక
విగ్రహాలు మద్యాన్ని, పాలను సేవిస్తాయా?
మరిన్ని
చరిత్ర పుటల్లో కర్బలా
దయ్యాల బెడదను వదిలించే మురికినీటి స్నానం
అశ్వత్థామ ఎవరు?
అశ్వద్ధామ ఇప్పటికీ సజీవుడై ఉన్నాడా?