ప్రధాన పేజి   ఆధ్యాత్మికం > ఏది నిజం > కథనం
 
రంగులు మార్చే శివలింగం...
WD PhotoWD
ఈ పురాతన దేవాలయంలోని తెల్లరంగు శివలింగంపై ఎరుపు రంగు పట్టీలు ప్రత్యక్షం కావడం చూసి భక్తులు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. చివరకు 'నంది' విగ్రహం కూడా రంగు మార్చుకుంది. మహాశివుని నేత్రాలు (శివలింగం) కూడా ప్రత్యేకతను సంతరించుకున్నాయి.

దేవాలయ పూజారి చంద్రశేఖర్ తివారీ మాతో మాట్లాడుతూ 20 సంవత్సరాల తన అనుభవంలో ఇటువంటి సంఘటన చోటు చేసుకోవడం ఇదే ప్రధమమని అన్నారు. తన ఉనికిని చాటుకునే క్రమంలో భగవంతుడు మన ఎదుట ఇటువంటి లీలలను ప్రదర్శిస్తుంటాడు. తనను నమ్మనివారికి తన గొప్పదనాన్ని తెలియజెప్పేందుకు భగవంతుడు ఇలా చేస్తాడు. ప్రతిదీ కూడా మన నమ్మకం పైన ఆధారపడి ఉంటుందని తివారీ పేర్కొన్నారు.

ఫోటోగ్యాలరీకోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇప్పుడిక శివలింగం తన యదార్ధ రూపాన్ని సంతరించుకున్నది. శివలింగానికి చేరిన ఎరుపురంగు, నల్ల మచ్చలుగా మారిందని భక్తులు పేర్కొంటున్నారు. మధుబాల, యోగితాసింగ్, వందనా పాండే, బ్రిజేష్ పాండే, అజిత్ కుమార్ శర్మ, మనోజ్ మిశ్రా తదితర రాణీకట్రా చౌక్‌కు చెందిన వారు కూడా ఈ సంఘటనను
WD PhotoWD
భగవంతుని లీలగా విశ్వసిస్తున్నారు.


సంఘటన అనంతరం, అనేకమంది భక్తులు ఈ ప్రాంతాన్ని దర్శించుకున్నారు. ఇదే తరహా సంఘటన సరోజనీ నగర్ పరిధిలోని చార్ బాగ్ మరియు 'గౌరీ గావ్' గ్రామాలలో కూడా చోటు చేసుకుంది. అనేక మంది ప్రజలు దీనిని అద్భుతంగా భావిస్తున్నారు.

పురావస్తు శాఖ అదనపు డైరక్టర్ పి.కె.సింగ్ విశ్వాసాన్ని అనుసరించి ఈ సంఘటన శాస్త్రీయ కారణాల వలన జరిగింది. వేల సంవత్సరాల నాటి విగ్రహాలలో కూడా ఇటువంటి మార్పులు చూడలేదని ఆయన అన్నారు. ఈ సంఘటన పురావస్తు శాఖకు సంబంధించినది కాదని పి.కె.సింగ్ విశ్వసిస్తున్నారు. మా ప్రయత్నంలో భాగంగా ఐ.ఆర్.టీ.సీ. మాజీ డైరక్టర్ డాక్టర్ పి.కె. సేథ్‌ వివరణ కోరాలని అభ్యర్థించగా ఆయన అందుకు నిరాకరించారు.

చర్చలో పాల్గొనాలని భావిస్తున్నారా? అయితే ఇక్కడ క్లిక్ చేయండి
వీడియోను వీక్షించండి
 << 1 | 2 | 3   
చిత్రమాల
రంగు మార్చుకుంటున్న శివలింగం ఫోటోగ్యాలరీ
వెబ్ ప్రపంచం చర్చా వేదిక
రామసేతువుకు ముప్పు తలెత్తడంతోనే శివలింగం రంగు మార్చుకుందని మీరు భావిస్తున్నారా?
మరిన్ని
వేడి ఇనుప కడ్డీల( చాచవా)తో వ్యాధి నివారణ
అతీంద్రియ శక్తిని తలపించే.. దేవాస్ మహాకాళేశ్వరుడు
కుక్కకాటును నయం చేసే 'కుక్‌రైల్ నాలా' స్నానం
మృత్యుకుహరానికి ద్వారం.. అంధ విశ్వాసం
వేలుతో తాకినంతనే వ్యాధి మటు 'మాయం'
"ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు ఉపశమనమందిస్తున్న బాబా..!"