వీడియోను చూసినట్లయితే శస్త్రచికిత్సలో అతని ఎత్తుగడ మీకు అర్థమవుతుంది. రోగి కడుపులో నుంచి ఒక మాంసపు ముక్కను అతడు బయటకు తీసి వ్యాధి నివారించబడిందని అతడు నమ్మబలుకుతాడు. వాస్తవానికి శస్త్రచికిత్స ప్రారంభానికి ముందే తన చేతిలో మాంసపు ముక్కను దాచుకునే అతను, శస్త్రచికిత్స ముగియగానే అదే మాంసపు ముక్కను రోగి శరీరంలో నుంచి తీసినట్లు అతడు నటిస్తాడు.
అతడు శస్త్రచికిత్స సమయం అసాధారణంగా ఉంటుంది. అదేలాగంటే అతడు శస్త్రచికిత్సను శనివారం అర్థరాత్రి మొదలుపెట్టి తెల్లవారుఝూమున మూడు గంటల దాకా కొనసాగిస్తాడు. శస్త్రచికత్స చేసే సమయంలో ప్రధాన ద్వారాలు మూసివేయబడతాయి. అదే సమయంలో దేవాలయం తలుపులను అతని అంగరక్షకులు మూసివేస్తారు. తన గ్రామానికి చెందిన ఐదుగురు మహిళలు ఇక్కడ శస్త్రచికిత్స చేయించుకోగా, వారిలో ఒకరి ఆరోగ్య పరిస్థితి విషమించిందని శస్త్రచికిత్స బాధితురాలైన రాజు బాయి మాతో అన్నది.
సీడీలో చూపినట్లుగా అతడు శస్త్ర చికిత్స చేయడని ఆమె వెల్లడించింది. వ్యాధికి గురైన ప్రాంతంలో కత్తితో చిన్నగాటును అతడు చేయడంతో ఆమెకు ఉపశమనం కలుగుతుందని చెప్పాడు. అంతేకాక ఆ గాటుపై బూడిదను అద్దుతాడు. ఇదిలా ఉండగా బూడిదపై కొందరు మా ఎదుట అనుమానాలు వ్యక్తం చేశారు. మత్తు మందును బాబా బూడిదలో కలిపి ఉండవచ్చునని వారి సందేహం.
|