అయితే ప్రతి కేసులోనూ అతను ప్రత్యేకించి ఆ అవివాహిత మహిళను మాత్రమే పిలవటాన్ని మేము గమనించాం. అతను చెప్పే కథాకమామిషుల వెనక ఉన్న అసలు రహస్యాన్ని మేము తెలుసుకున్నాం. అయితే ఏ ఒక్క భక్తుడు ఆ దిశగా ఆలోచించకపోవటాన్ని చూసి మాకు ఆశ్చర్యమేసింది.
తాను ఎటువంటి ఫలాన్ని ఆశించటం లేదని బాబా చెప్పాడు. అయితే భక్తులు బాబాకు పూల దండలు, సువాసనలు వెదజల్లే సాంబ్రాణీ కడ్డీలు సమర్పిస్తున్నారు. దీనినిబట్టి బాబాకు వీటిని తప్పకుండా సమర్పించాలన్న విషయం అవగతమయ్యింది. బాబా మహిమను తెలుసుకుని తాము అక్కడకు వస్తున్నట్లు భక్తులు మాతో అన్నారు
అంతేకాదు బాబా చికిత్స చేసిన తర్వాత తమకు ఎంతో ఉపశమనం కలిగిందని కొందరు భక్తులు చెపుతున్నారు. అయితే వారు చెప్పేదాని వెనక ఉన్న అసలు రహస్యం మాకు తెలియదు, కానీ సదరు వ్యక్తి మాత్రం రోజుకో కొత్త సంగతిని చెపుతూనే ఉన్నాడు.
అంతేకాదు కేవలం బ్లేడు సాయంతో మేజర్ ఆపరేషన్ సైతం చేస్తానంటున్నాడు. తడి నేలను ఉపయోగించి కిడ్నీలో రాళ్లు లేకుండా కిడ్నీ బాగుచేస్తానంటున్నాడు. ఇటువంటి చిత్రమైన సంగతులు చెప్పే బాబాలు గురించి మీరేమనుకుంటున్నారు?
|