|
|
|
అక్కడ నమస్కరించకపోతే యాక్సిడెంట్ ఖాయం...
|
|
|
|
|
సోమవారం, 18 ఫిబ్రవరి 2008( 20:27 IST )
|
|
|
|
|
|
|
|
|
|
|
| | 'ఏదినిజం' శీర్షికలో భాగంగా ఈసారి... 'ఇప్పటికీ బతికే ఉన్నాడు' అని భావించే ఓ మహావ్యక్తి గురించి తెలియజేయబోతున్నాం. ఆశ్చర్యపోతున్నారా.. నిజమండీ... మధ్యప్రదేశ్‌లోని 'మౌ' వాసుల హృదయాలలో అతను ఇంకా బతికే ఉన్నాడు. అతనే తాంత్యా భీల్. అతని గురించే మీకు తెలియజేయబోతున్నాం. | |
చివరికి పాటల్పానీ జలపాతానికి సమీపంలో గల రైల్వే ట్రాక్ వద్ద అతను ఎన్‌కౌంటర్ చేయబడ్డాడు. అయితే తాంత్యా ఆత్మ మాత్రం నేటికీ అక్కడ తిరుగాడుతోందని విశ్వాసం. ఈ నమ్మకాన్ని మరింత బలపరిచే విధంగా అతను మరణించిన నాటి నుంచి ప్రత్యేకించి ఆ రైలు మార్గంలోనే ప్రమాదాలు ఎక్కువయ్యాయి. తాంత్యా భీల్ వల్లనే ప్రమాదాలు జరుగుతున్నాయనీ, వాటి నివారణకు ఆ ప్రదేశంలో తాంత్యా భీల్ ఆలయాన్ని సైతం నిర్మించారు. అప్పటినుంచి అటుగా వెళ్లే రైళ్లన్నీ తప్పకుండా భీల్ దగ్గర ఆగి ఓ నమస్కార బాణం వేసి కదలటం ప్రారంభించాయి.
|
|
|
|
|