|
అపారమైన విశ్వాసం... అద్భుతాల సమాహారం
|
|
|
|
|
సోమవారం, 3 మార్చి 2008( 20:35 IST )
|
|
|
|
|
|
|
|
 | | IVR |
|
|
|
| | ఆయన చేయి చాపితే చాలు.... శివలింగం ప్రత్యక్షం. అంతర్జాతీయ ఆధ్యాత్మిక నేతగా భక్తుల నీరాజనాలందుకుంటున్న ఆయన...చిటికె వేస్తే చాలు విభూతి రాలుతుంది. మీరు ఊహించింది నిజమే... ఆయనే సత్యసాయిబాబా... ఈ వారం ఏది నిజం శీర్షికలో సత్యసాయిబాబాను మీకు పరిచయం చేస్తున్నాం.
ఆంధ్రప్రదేశ్, అనంతపురం జిల్లా, ప్రశాంతి నిలయం (పుట్టపర్తి) పట్టణంలో నివాసం ఉంటున్నప్పటికీ, సత్యసాయిబాబాను అంతర్జాతీయ ఆధ్యాత్మిక నేతగా భక్తులు కొలుస్తుంటారు. అదే క్రమంలో సత్యసాయిబాబాకు పలు అద్భుతాలు, విశ్వాసాలు ఆయన అనుయాయులు ఆపాదిస్తుంటారు. భక్తుల బాధలను స్వీకరించి వారి ఈతిబాధలను తీర్చే భగవత్‌స్వరూపునిగా బాబాను నమ్మినవారు త్రికరణ శుద్ధిగా చెప్తుంటారు. మానవాతీతమైన అద్భుతాలకు ప్రశాంతి నిలయం ప్రపంచ వ్యాప్తంగా పేరొందడానికి సత్యసాయిబాబానే కారణమని తెలుపుతుంటారు.| మీరు కూడా దైవ స్వరూపులే... |
| | “నేను దేవుడిని. మీరు కూడా దైవస్వరూపులే. ఈ విషయం నాకు సంపూర్ణంగా అవగతం కాగా మీరు పూర్తిగా అవగతం చేసుకోలేదు. ఇదే మీకు నాకు గల వ్యత్యాసం." |
| |
విభూతి, తినుబండారాలు, బంగారపుటుంగరాలు, స్వర్ణశోభితమైన కంఠహారాలు ఇత్యాది వాటిలో ఏదో ఒకదానిని కరకమలాల నుంచి సృష్టించి బాబా భక్తులకు అందిస్తుంటారు. ప్రతిరోజూ తన దర్శనార్థం విచ్చేసే భక్తులకు పైన పేర్కొన్న వస్తువుల్లో ఏదో ఒకదానిని ప్రసాదంగా ఇవ్వడం బాబా దినచర్యలో ఒక భాగమని భక్తులు చెప్పుకుంటుంటారు. |