పెళ్లిలో ఏడడుగులు చుట్టూ తిరిగే సంప్రదాయమున్నట్టే ఆ సంచిని తీసుకునేందుకై వారు కూడా ఏడు విడతలుగా ప్రయత్నిస్తారు. ఏడు పర్యాయాలు మహిళల చేతిలో దెబ్బలు తప్పించుకుంటూ మగవాళ్లు ఆ స్తంభాన్ని అక్కడి నుంచి పెకిలించి వేసేందుకు ప్రయత్నిస్తారు. భూమిలో దాన్ని నాటిన చోట ఉన్న గుంతను పూడ్చేంతవరకు కూడా ఆడాళ్ల దగ్గర మగాళ్లు దెబ్బలు తినే ఈ తంతు కొనసాగుతూనే ఉంటుంది. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత అందరూ తమ భేదాలు మరచి, ఆడుతూ పాడుతూ సంబరాలను ఆనందంగా ముగిస్తారు. భార్యలు తమ భర్తల క్షేమంకోసం, తమ పెళ్లి పవిత్రతను రక్షించాలని ప్రార్థిస్తారు. ఆ తర్వాత శక్తిమాతను గ్రామంలో ఊరేగింపుగా తీసుకువెళ్లి గోధ్ భరాయ్ (పిల్లల కోసం ప్రార్థన) సంప్రదాయాన్ని ముగిస్తారు.
పురుషులు తమ భార్యలపై ఏడాది పూర్తిగా ఆధిపత్యం చెలాయిస్తున్నా, స్త్రీలు మాత్రం తమ భర్తలు క్షేమంగా ఉండాలని ఆ రోజు తమ శక్తిమాత గంగౌర్‌ను ప్రార్థిస్తున్నారని గ్రామస్తుల విశ్వాసం. తాము చేసిన ప్రక్షాళన చేసుకునేందుకే మగవారు ఆ రోజున భార్యల చేతిలో దెబ్బలు తింటారు.
దీనిపై గ్రామ పెద్ద మాట్లాడుతూ సంబరాలను ఘనంగా జరుపుకునే క్రమంలోనే గ్రామస్తులు ఈ తంతు నిర్వహిస్తున్నారని చెప్పారు. పలు గ్రామాల నుంచి ప్రజలు ఈ సంబరాలలో పాల్గొంటున్నారన్నారు. మహిళలు దేవతలతో సమానమని, వారిపై కిరాతక చర్యలకు పాల్పడటం ద్వారా మంచి కన్నా చెడు అధికంగా జరుగుతుందని మగవాళ్లకు తెలియజెప్పడమే ఈ తంతు ఉద్దేశ్యమని చెప్పారు. మీరు ఈ ఆచారం గురించి ఏమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలు మాకు పంపండి.
|