|
|
|
దెయ్యాల్ని పారద్రోలే మహార్తి పూజలు
|
|
|
|
|
సోమవారం, 5 మే 2008( 18:31 IST )
|
|
|
|
|
|
|
|
|
|
|
| | దుష్టశక్తులు తరిమేందుకై కర్పూర హారతి ఇస్తున్న పళ్లాన్ని భక్తులు చేతితో విచిత్రంగా పట్టుకునే దృశ్యాన్ని మధ్యప్రదేశ్‌లోని బిజాల్‌పూర్‌లో ఉన్న దత్తా దేవాలయంలో చూడవచ్చు. ఈ పూజలో పాల్గొనే భక్తులను పీడిస్తున్న దుష్టశక్తులు వారిని వీడి వెళతాయనేది స్థానికుల విశ్వాసం. ఈ విచిత్రమైన పూజల గురించి తెలిసిన వెంటనే ఆ గుడిని కనీసం ఓ సారైనా దర్శించి, అక్కడి విశేషాలను తెలుసుకోవాలని బయలుదేరాం. దత్తుని గుడికి వెళ్లే ముందు అక్కడ ఓ ఎరుపు జెండా గుడిపై చాలా ఎత్తున ఎగురుతుండటం మాకు కన్పించింది. దేవాలయ ప్రాంగణంలో భారీ సంఖ్యలో ప్రజలు గుమిగూడి ఉన్నారు. సాధారణంగా శుక్రవారాల్లోనే ఈ పూజలు నిర్వహిస్తారని భక్తుల ద్వారా ముందే తెలుసుకున్నాం.| మహా హారతితో దెయ్యాలు పరార్ |
| | దత్ మహారాజ్ ఆత్మ తనలో ప్రవేశించడం ద్వారా ఈ పూజల్లో పాల్గొనే భక్తుల బాధలను, వ్యాధులను నయం చేస్తోందని చెబుతున్నారు. మేము ఆయనతో మాట్లాడుతుండగానే మహా హారతి ప్రారంభమైంది |
| |
| |
పూర్వం తమ వంశానికి చెందిన హరినుమా సాహెబ్ 12 సంవత్సరాల కఠోర తపస్సు చేయడంతో దత్తాత్రేయ స్వామి అనుగ్రహించాడని తమ పూర్వీకుల ద్వారా తెలిసిందన్నారు. కావాల్సిన వరం కోరుకోమని స్వామి వారు సూచించగా, ఈ దేవాలయంలోనే కొలువుండాలని ఆయన కోరుకున్నాడని తెలిపారు. దీంతో అప్పటి నుంచి దత్తాత్రేయ స్వామి ఆత్మ ఈ దేవాలయంలోనే ఉంటోందని చెప్పారు.
|
|
|
|
|