| అసురుడిని పూజించే గ్రామం... |
| | | | సోమవారం, 23 జూన్ 2008( 18:16 IST ) | | | |
| | |
| |
ఒకసారి ఈ ప్రాంతంలో బురద నేలలో చెరకు బండి దిగబడిపోయింది. దాన్ని బయటకు లాగడానికి ఎన్నివిధాలుగా ప్రయత్నించినప్పటికీ ఫలించలేదు. అప్పడు వాహనం కేబిన్‌లో ఉన్న హనుమంతుడి ఫోటోను తొలగించాల్సిందిగా గ్రామంలో ఒకరు సలహా ఇచ్చారు. అలా ఫోటోను కేబిన్‌లోంచి తీసివేసిన తర్వాత బురదనేలలోంచి ట్రక్కును అవలీలగా లాగగలిగారు.
నింబాదిత్య ఆలయాన్ని హేమంద్‌పంతి అనే అతను నిర్మించాడని పోలీస్ కానిస్టేబుల్ అవినాశ్ గార్జే పేర్కొన్నారు. ఈ గ్రామం మొత్తం మీద ఇదొక్కటే రెండు అంతస్థులను కలిగి ఉంది. ఎందుకంటే.. నింబాదిత్యపై భక్తిభావంతో ఈ గ్రామస్థులు తమకోసం రెండంతస్థుల భవంతులను నిర్మించుకోలేదు. ఈ ఆలయం ముందు పెద్ద మర్రి చెట్టు ఉంది. ఈ రాక్షసేశ్వరుని పట్ల ప్రజలు ఎంత వీరారాధన కలిగి ఉన్నారంటే ఇక్కడి ప్రతి భవంతిమీద, షాపులపై, వాహనాలపై నింబాదిత్య ఆశీస్సులతో కూడిన సూక్తులు రాయబడి ఉంటాయి. గ్రామానికి బయటినుంచి వచ్చే అందరికీ ఇవి కనిపిస్తాయి.
ఈ గ్రామంలో ఇళ్లమీద, మోటారు బైకుల మీద, షాపుల మీద అన్ని చోట్లా నింబాదిత్య పేరు కనబడుతుంది. ఈ గ్రామంలో హనుమంతుడిని అపశకుని (దురదృష్టాన్ని కొనితెచ్చేవాడు) అని పిలుస్తారు. మరోవైపు నింబాదిత్యను ప్రజలు ఇంటి ఇలవేల్పుగా భావిస్తుంటారు. ఒక రాక్షసుడిని ఇంటి ఇలవేల్పుగా ప్రజలు పూజించడం వింతగా ఉంటుంది కానీ, ఇది నింబాదిత్య గ్రామానికి సంబంధించిన వాస్తవం. ఇలాంటి ఘటనలు మీ దృష్టికి వస్తే దయచేసి మాకు వ్రాయండి. |