నదీతీరంలో ధర్మేంద్ర అగర్వాల్ అనే ప్రర్యాటకుడు తన మేనల్లుడు ఆయుష్‌తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నాడు. ఈ పూజను విజయవంతంగా పూర్తి చేసిన పక్షంలో ఎలాంటి భయభ్రాంతులు లేకుండా ఒకే పడవలో ప్రయాణించవచ్చు.
ఈ ప్రత్యేక పూజ గురించి తాము పూజారి అఖిలేష్‌ను అడిగినప్పుడు అతను ఆసక్తిని కలిగించే ఓ కథను చెప్పుకొచ్చాడు. పూర్వం గోకులం నుంచి మధుర రాజు కాన్ అతని మేనల్లుడు కలిసి ఒకే పడవలో నదిలో ప్రయాణిస్తుండగా, ఆదిశేషు ప్రత్యక్షమై వారి పడవను తలకిందులు చేసిందట. ఆ సంఘటన జరిగిననాటి నుంచి నీమావార్ ప్రాంత ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ మేనల్లుడు, మేనమామలు ఒకే పడవలో విహరించడాన్ని అనుమతించడం లేదు.
ఇది భయమా... నిజమా.. లేదా నమ్మకమా... అలాకాదంటే మూఢ విశ్వాసమా అన్న విషయాలను ప్రక్కనపెడితే ఇక్కడి ప్రజలు మాత్రం ఈ సంప్రదాయాన్ని ఖచ్చితంగా పాటిస్తున్నారు. ఈ అంశంపై మీరేమనుకుంటున్నారు... దయచేసి మాకు రాయండి. |