అయితే, మన దేశంలోనూ మనిషి ముఖాన్ని చదివి అతడి ప్రవృత్తిని, స్వభావాన్ని అంచనా వేసే పద్ధతి ఒకటి ఉంది. ఈ కళ సాముద్రిక లక్షణం అని పిలువబడుతోంది. ఇది మన గడ్డపై చాలా కాలం నుంచి వాడుకలో ఉంది. ముఖాన్ని చూసి వ్యక్తి స్వభావాన్ని, చివరకు అతడి జాతకాన్ని సైతం కనిపెట్టే పద్ధతిని మన దేశంలో జ్యోతిష్కులు ఏనాటి నుంచో అనుసరిస్తూ ఉన్నారు.
మేము చార్లెస్ లె బ్రన్ చిత్రాలను చూపించినప్పుడు పిజియానమీని సాముద్రిక లక్షణంతో మన జ్యోతిష్కుడు కె.పి విద్యాధరన్ ఎలా పోల్చి చూశారో వినండి: "ఏనుగు కళ్లను పోలిన కళ్లను కలిగి ఉన్న కొంతమంది ప్రజలను మేం చూస్తూ వచ్చాము. అయితే వారి దృష్టి మాత్రం ఏనుగుల చూపు వలే చాలా నిశితంగా ఉంటుంది. కొంతమంది ప్రజల కళ్లు పిల్లి కళ్లలా ఉంటాయి. ఇలాంటివారు ఏ పని చేసినా పిల్లి అంత జాగరూకతతో ప్రారంభిస్తారని నా పరిశీలనలో తేలింది. అయితే తర్వాత పని ముగించేటప్పుడు కూడా పిల్లి అంత జాగ్రత్తగానే ముగించేవారు.
కొంతమంది ప్రజల ముఖాలు గుర్రపు ముఖాలను పోలి ఉంటాయి. గుర్రంలాగే ఈ వ్యక్తులు ఏ మాత్రం అలుపు లేకుండా తిరుగుతూ ఎంతపనైనా అవలీలగా చేస్తూ ఉంటారు. అలాగే కొంత మంది ముఖాలు చిలుక ముఖాన్ని పోలి ఉంటాయి. ఇలాంటి వ్యక్తులు చిలుకలాగే కష్టపడి పనిచేస్తారు పైగా వాటిలాగే భవిష్యత్తు కోసం కొంత ఆదా చేసుకుంటారు. కష్టపడి పనిచేసి సంపాదనలో పొదుపు చేయడం ద్వారా తమ చెల్లెళ్ల వివాహాలను ముగించి జీవితంలో బరువు బాధ్యతలను ముగించుకున్నామని వీరు చెబుతుంటారు.
కాబట్టి ప్రతి మనషిలోనూ మనం చూసిన అనుభవం బట్టి, జంతువు లేదా పక్షి ముఖ రూపాన్ని ప్రతిబింబించే వారి ముఖంలో ఆ జంతువు లేదా పక్షి స్వభావం ప్రతిబింబిస్తూ ఉంటుంది".
అయితే మనం దీన్ని సమగ్ర జ్ఞానం అని చెప్పవచ్చా? ఇది లోతుగా చర్చించవలసిన విషయం మరి. ఒక మనిషి స్వభావాన్ని అంచనా వేయాలంటే మనం కేవలం మనిషి ముఖ పరిశీలన మీద మాత్రమే ఆధారపడలేము. మరి ఈ విజ్ఞానం లేదా పద్ధతుల గురించి మీరు ఏమనుకుంటున్నారు? మీరు ఇవన్నీ నమ్మగలరా? దయచేసి మాకు రాయండి.
|