ఇదేకాదు, తమతమ శరీరంలోకి అమ్మవారు, కాలభైరవుడు ఆవహించినట్లు భావింపబడేవారు కలిసి నాట్యం చేస్తారు. కనీసం పాదరక్షలు ధరించకుండా మండుతున్న నిప్పులపై నడుస్తారు. వీరు చేసే ఈ పనులకు మిగిలిన భక్తులు సహకారమందిస్తుంటారు. ఎందుకంటే ఇదంతా దుర్గామాతను కొలిచే తంతులో భాగమే మరి. ఇలా ఒక వ్యక్తిలో అమ్మవారు ప్రవేశించటం... ప్రవేశించిందని భావింపబడిన వ్యక్తులను పూజించటం అనేవి భక్తికి సంకేతంగా చెప్పవచ్చా...? లేదంటే దుర్గామాత తన భక్తుల శరీరంలోకి ప్రవేశించడం అనే అంశం కేవలం భక్తులను ఆకర్షించడానికి చేస్తున్న జిమ్మిక్కా...? దీనిపై మీరేమి ఆలోచిస్తున్నారు...? దయచేసి మీ అభిప్రాయాలను తెలియజేయండి. |
సంబంధిత సమాచారం కోసం శోధించండి. |