ప్రధాన పేజి   ఆధ్యాత్మికం > ఏది నిజం > ఇదీ సంగతి
 
దేవునితో మాట్లాడే ఫ్రిడ్జ్ మెకానిక్
FileFILE
హఠాత్తుగా పటేల్ తన దేహంపై పట్టును కోల్పోసాగాడు. "అంతేకాక పంచేయాంద్రియాలు మాట వినడం మానేసాయి. గాలిలో తేలిపోతున్న అనుభూతిలో నేనుండగా... పరమశివుడు నా ఎదుట ప్రత్యక్షమయ్యాడు... ఒకరితో ఒకరం సంభాషించుకోసాగాం..." అని దాదా పరవశంగా తెలిపాడు.

"పరమేశ్వరుని చేరుకోవడం కన్నా ఉత్తమమైన సత్‌గతి మానవునికి ఏముంటుంది?!" అరమోడ్పు కన్నులతో చెప్పిన దాదా అప్పటి నుంచి మానవాతీత శక్తులు తనను అంటిపెట్టుకుని ఉన్నాయని నమ్మబలుకుతాడు. వివాహమై ఒక కుమార్తె కలిగినప్పటికీ, సదా సదాశివుని ధ్యానంలో గడిపే దాదా... నిద్రాహారాలపై అపరిమితమైన నియంత్రణను అలవరచుకున్నాడు.

"దాదా ఏది చెబితే అది జరిగి తీరుతుంది. అలాగే ఇది జరగదు అని దాదా చెబితే దాని గురించిన ఆందోళన పడవలసిన అవసరం లేదని" దాదా అతీత శక్తుల పట్ల ప్రగాఢ విశ్వాసాన్ని కలిగిన గ్రామస్థులు చెపుతుంటారు. దాదా దర్శనార్ధం భక్తులు దూరప్రాంతాల నుంచి కూడా వస్తుంటారు.

ఒకనాటి పటేల్ రిఫ్రిజిరేటర్ దుకాణం కేవలం జ్ఞాపకాలకే పరిమితమైంది.
ఎందుకంటే...
దుకాణం ఉన్న చోట దాదా కొలువైన దేవాలయం వెలిసింది కనుక...
 << 1 | 2 | 3   
మరిన్ని
బీహార్‌లో 'మానవసర్పం'