ప్రధాన పేజి > ఆధ్యాత్మికం > ఆధ్యాత్మికం > కథనాలు > గణేశ్ ఉత్సవాలపై విదేశీ విద్యార్థుల ఆసక్తి
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
గణేశ్ ఉత్సవాలపై విదేశీ విద్యార్థుల ఆసక్తి
భారతీయ సంస్కృతిపై విదేశీయులకు ఉన్న మక్కువ అంతా ఇంతా కాదు. యాంత్రిక జీవితానికి అలవాటు పడిన విదేశీయులకు భారత దేశమన్నా, వారి సాంప్రదాయాలు, కట్టుబాట్లన్నా అమితమైన గౌరవం. భారతీయ సంస్కృతిని ఇష్టపడి చాలా మంది యువతులు చీరలు కట్టడం, బొట్టు పెట్టుకోవడం లాంటి సాంప్రదాయాలను పాటిస్తున్నారు.

అంతే కాదు విదేశీయులకు భారత దేవుళ్లన్నా అంతే ఆసక్తి. రాజధానిలో జరుగుతున్న గణేశ్ ఉత్సవాలను తిలకించేందుకు భారత్‌లోని కొంత మంది విదేశీ విద్యార్థులు ఉబలాటపడడమే ఇందుకు ఉదాహరణ.

పదకొండు రోజుల పాటు అతి వైభవంగా జరిగే ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు వారు సికింద్రాబాద్‌లోని వినాయక ఆలయానికి విచ్చేశారు. సామూహికంగా జరిగే ఈ ఉత్సవాలు అందరినీ అలరిస్తాయని వారు అభిప్రాయపడుతున్నారు.

కుల, మత బేధాలు లేకుండా అన్ని వర్గాల వారు ఈ ఉత్సవాల్లో పాల్గొనడం చూస్తుంటే తమకు చాలా ఆనందంగా ఉందని వారంటున్నారు. అలాగే చివరి రోజున ఊరేగింపుతో స్వామి వారి విగ్రహాలను నిమజ్జనం చేయడమనేది చాలా వైవిధ్యమైన అంశంగా వారు అభివర్ణించారు.

ఈ ఉత్సవాలు మాత్రమే కాదు, తిరుపతిలో జరిగే బ్రహ్మోత్సవాలు, బెజవాడ దుర్గగుడిలో జరిగే అమ్మవారి ఉత్సవాలు... ఇలా దేశంలో జరుగుతున్న పలు దైవ కార్యక్రమాలు విదేశీయులను బాగా ఆకర్షిస్తున్నాయనే చెప్పాలి.

దైవ కార్యాలతో పాపాలు హరిస్తాయని హిందువులు విశ్వసిస్తున్నట్టుగానే, విదేశీయులు కూడా నమ్మడంతో పాటు పూజలు కూడా నిర్వహిస్తుంటారు. ఏది ఏమైనా భారతీయ సంస్కృతి ప్రపంచంలో నలుమూలలకు పాకడంపై మనం సంతోషించాలి.
మరిన్ని
ముంబై వినాయకుడికి రూ.2.7 కోట్ల ఇన్య్సూరెన్స్
స్త్రీలకు ప్రవేశం లేని కార్తికేయుని ఆలయం
ఎవరు గొప్ప?
వయ్యారి నడకలో పైచేయి ఎవరిది!
కృష్ణుడి తలపై నెమలి పింఛం వెనుక...
శ్రీవారికి 'పునుగు' పాట్లు