ప్రధాన పేజి > ఆధ్యాత్మికం > ఆధ్యాత్మికం > కథనాలు > దేశదేశాలూ పాకిన వినాయక మహత్యం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
దేశదేశాలూ పాకిన వినాయక మహత్యం
ganesh
WD PhotoWD
విఘ్నపతిగా వినాయకుడిని కేవలం మనదేశంలోనే కాదు విదేశాల్లోనూ భక్తులు కొలుస్తున్నారు. పార్వతీ తనయుడు వివిధ దేశాల్లో కూడా భక్తుల పూజలందుకుంటున్నాడు. అక్కడి ప్రవాస భారతీయులు మాత్రమే కాదు, విదేశీయులు కూడా ఈ
వివిధ రూపాల్లో వినాయకుడు
  చైనాలో కూడా గణేశుడు వివిధ పేర్లతో, రూపాలతో మనకు దర్శనమిస్తాడు. అక్కడి కోట్టాన్ అనే ప్రాంతంలోని వినాయకుడిని అరకాలు పంచె వినాయకుడు అని పిలుస్తుంటారు.      
న భక్తులుగా మారడం విశేషం.

తూర్పు ఆసియా, ఆగ్నేయ ఆసియా, ఐరోపా ఖండాలలో వినాయకుడిని పూజిస్తున్నారు. అంతేకాదు, చైనాలో కూడా గణేశుడు వివిధ పేర్లతో, రూపాలతో మనకు దర్శనమిస్తాడు. అక్కడి కోట్టాన్ అనే ప్రాంతంలోని వినాయకుడిని అరకాలు పంచె వినాయకుడు అని పిలుస్తుంటారు. ఆయనకు అరకాలు ఉన్న పంచె ఉండటమే ఇందుకు కారణం.

జపాన్ దేశంలో గణపతి వినాక్‌షా, షోడన్ అని, జావా దీవిలో స్వామివారిని గుండు వినాయకుడని పిలువబడుతున్నాడు. ఈజిప్టులో ఉండే వినాయకుడు చేతిలో తాళాలు కలిగి ఉండటంతో ఆయనకు తాళాల వినాయకుడు అని పేరు వచ్చింది. మంగోలియాలో నిరుత్త గణపతి అని, రోమ్ దేశంలో జోన్స్ అని పిలువబడుతుంటాడు.

అంతేకాదు, శ్రీలంక, నేపాల్, టిబెట్ దేశాల్లో కూడా వినాయక పూజలు మనం చూడవచ్చు. ఏది ఏమైనా, దాదాపు ప్రపంచంలోని అన్నిదేశాలకు మన సాంప్రదాయాలు, దైవపూజావిధానాలు పాకాయంటే సంతోషమే కదా మరి!
మరిన్ని
వడ్డికాసులవాడా... చూడవయా ఈ వడ్డింపులు  
కఠోర నిత్య సాధన.. వేద పారాయణం  
విభీషణుడి ఔదార్యం
ఏ దిశలో కూర్చుని భుజించాలి?
విభిన్నంగా మొక్కులు తీర్చుకునే భక్తులు  
అభ్యంగన స్నానాలు ఎప్పుడు చేయాలి?