ప్రధాన పేజి > ఆధ్యాత్మికం > ఆధ్యాత్మికం > కథనాలు > వెంకన్న ఆదాయానికే నామం...?
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
వెంకన్న ఆదాయానికే నామం...?
నిత్య కల్యాణం... పచ్చతోరణంగా అలరారే తిరుమల వేంకటేశుని సంవత్సరాదాయం రూ.1200 కోట్లు. మొత్తం ఆస్తుల విలువ సుమారు 75 వేల కోట్ల రూపాయలు. ఈ సంపదను ఎవరూ కొల్లగొట్టకుండా ఉండేందుకు ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానానికి స్వయం ప్రతిపత్తి కల్పించింది.

అయితే పాలకమండలిలో రాజకీయ నాయకులు జొరబడటంతో నిధులు పక్కదారి పడుతున్నాయి. హిందూ ధర్మాభివృద్ధికి మాత్రమే వినియోగించాల్సిన నిధులను రోడ్లు, చెరువులు... తదితర పనులకై కేటాయిస్తున్నట్లు ఆరోపణలు వినబడుతున్నాయి.

తుమ్మలకుంట గ్రామంలో రోడ్డు నిర్మాణానికిగాను తిరుమలేశుని ఆదాయం నుంచి రూ. 7 కోట్లు కేటాయించినట్లు ఆరోపణ. అలాగే తిరుపతి- చెన్నై రోడ్డు మార్గానికి రూ.9 కోట్లు, చిత్తూరు నీటి పథకానికి రూ.150 కోట్లు కేటాయించినట్లు వార్తలు వచ్చాయి.

వేంకటేశుని నిధులు పక్కదారి పట్టడంపై తిరుమల తిరుపతి పరిరక్షక సమితి తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. నిధులను హిందూ ధర్మానికే వినియోగించాలని నిబంధన ఉన్నప్పటికీ దానిని తోసిరాజని ఇతర పనులకు ఉపయోగించడం ఎంతవరకు సబబని ప్రశ్నిస్తున్నాయి.

ఈ విషయంపై టిటిడి ఇవో మాట్లాడుతూ.... నిధులు పక్కదారి మళ్లడంలో నిజం లేదన్నారు. తాగునీటి సౌకర్యం వంటి బృహత్ కార్యక్రమానికి టిటిడి 50 శాతం నిధులను ఖర్చు చేయాల్సిందిగా ప్రభుత్వం జీవో జారీ చేసిందనీ, దానిపై బోర్డు మీటింగ్ లో చర్చిస్తామని పేర్కొన్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
వీడియోను వీక్షించండి
మరిన్ని
భోజనానికి లేవండి...
నవగ్రహాలు ఇలా కూడా ఉంటాయి!!
సముద్రంలో ఎప్పుడు స్నానం చేయకూడదు?
అమ్మవారిని ఎప్పుడు స్తుతించాలి?
దేశదేశాలూ పాకిన వినాయక మహత్యం
వడ్డికాసులవాడా... చూడవయా ఈ వడ్డింపులు