ప్రధాన పేజి > ఆధ్యాత్మికం > ఆధ్యాత్మికం > కథనాలు > కార్తీక సోమవారంలో దీపారాధన చేయండి
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
కార్తీక సోమవారంలో దీపారాధన చేయండి
FILE
కార్తీక మాసంలో వచ్చే సోమవారాలకు ఓ ప్రత్యేకత ఉంది. సోమవారానికి చంద్రుడు అధిపతి. దేవతలలో ప్రథముడైన అగ్నినక్షత్రాలలో మొదటిదైన కృత్తికకు అధిపతిగా ఉండటం, చంద్రుడు పూర్ణుడై ఈ నక్షత్రం మీద ఉండటం చేత ఈ మాసంలోని సోమవారాలకు విశిష్టత ఉందని ఆర్యులు పేర్కొంటున్నారు. కాబట్టి చంద్రుని వారమైన కార్తీక సోమవారం శివునికి ఎంతో ప్రీతికరమైందని వారు చెబుతున్నారు.

ఈ వారంలో ముత్తైదువులు భక్తిశ్రద్ధలతో శివునిని కొలిస్తే మాంగల్య భాగ్యం చేకూరుతుందని విశ్వాసం. ఇంకా చెప్పాలంటే.. ఈ సోమవారాల్లో శైవభక్తులు నిష్టనియమాలతో శివునిని ఆరాధిస్తారు. సోమవారం సూర్యోదయానికి పూర్వమే బ్రహ్మముహూర్తమున స్నానమాచరించి "హరహరశంభో" అంటూ శివుణ్ణి స్తుతిస్తే... పాపాల నుంచి విముక్తి లభించడంతో పాటు... అష్టైశ్వర్యాలు కలుగుతాయని ఆర్యులు అంటున్నారు.

ఈ మాసమంతా ఉపవాసముండి శివునిని కొలిస్తే... కైలాస వాసం సిద్ధిస్తుందని శాస్త్రోక్తం. సోమవారం ఉదయం స్నానాదికార్యక్రమాలను పూర్తి చేసుకుని, పొడిబట్టలు ధరించి మొదటగా దీపారాధన చేయాలి. అనంతరం శివునికి రుద్రాభిషేకం చేయించి శివవ్రత నియమాలను పాటించాలి. ఈ విధంగా చేయడం ద్వాపా నిత్య సిరిసంపదలతో, సుఖసౌఖ్యాలతో వర్ధిల్లుతారని నమ్మకం.

ఈ మాస ప్రారంభం నుంచి సూర్యోదయానికి ముందే లేచి స్నానమాచరించి, స్త్రీలు నదులలో, కోనేటిల్లో దీపాలు వదులుతారు. కార్తీక మాసంలో దీపాన్ని దానం ఇస్తే... మాంగల్యబలం, కీర్తి సౌభాగ్యాలు కలుగుతాయని ఐతిహ్యం. ఇలా సోమవారాల్లో మాత్రమే కాకుండా కార్తీక మాసమంతా నిత్యదీపారాధనతో శివునిని ప్రార్థిస్తే సకల సంపదలు చేకూరుతాయని ఆర్యుల నమ్మకం.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
ఏడుకొండలవాడా... నీవే మాకు దిక్కు  
వెంకన్న ఆదాయానికే నామం...?  
భోజనానికి లేవండి...
నవగ్రహాలు ఇలా కూడా ఉంటాయి!!
సముద్రంలో ఎప్పుడు స్నానం చేయకూడదు?
అమ్మవారిని ఎప్పుడు స్తుతించాలి?