ప్రధాన పేజి > ఆధ్యాత్మికం > ఆధ్యాత్మికం > కథనాలు > మట్టి ప్రమిదలతో దీపాలను వెలిగించండి
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
మట్టి ప్రమిదలతో దీపాలను వెలిగించండి
FILE
కార్తీక పౌర్ణమి రోజున సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో మట్టిప్రమిదలతో దీపాలను వెలిగిస్తే ఆ గృహంలో అష్టైశ్వర్యాలు కొలువుంటాయని ఐతిహ్యం. వీలైన వారు 108 ప్రమిదలతో ఆలయాల్లో దీపాలను వెలిగిస్తే.. పుణ్యఫలాలు సిద్ధిస్తాయని ఆర్యుల నమ్మకం.

ఇకపోతే.. గృహంలో 21 మట్టి ప్రమిదలలో దూది, నువ్వులనూనెతో దీపాలను వెలిగించడం మంచిది. దీనికిముందే పూజగదిని అందంగా అలంకరించుకుని నేతితో దీపాన్ని వెలిగించుకోవాలి.

నుదుట విభూతిని, మెడలో రుద్రాక్ష మాల లేదా శివలింగముతో తయారైన మాలను ధరించి 108 సార్లు "ఓం నమః శివాయః" మంత్రాన్ని జపించాలి. పూజకు అన్నీ సిద్ధం చేసుకుని పడమర దిక్కుగా తిరిగి శివపరమాత్మను పూజించుకుంటే శుభప్రదమని ఐతిహ్యం.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
శివాలయాల్లో రుద్రాభిషేకం చేయించండి
కార్తీక పౌర్ణమి నేడే... శివాలయాలకు వెళ్లండి.
పుణ్యఫలం కోసం "కార్తీక వ్రతాన్ని" ఆచరించండి
కార్తీక సోమవారంలో దీపారాధన చేయండి
ఏడుకొండలవాడా... నీవే మాకు దిక్కు  
వెంకన్న ఆదాయానికే నామం...?